Home న్యూస్ “మా వింత గాధ వినుమా” రివ్యూ….ఏంటి సామి ఇది!!

“మా వింత గాధ వినుమా” రివ్యూ….ఏంటి సామి ఇది!!

1

తెలుగు లో మొదటి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న కృష్ణ అండ్ హిస్ లీలా సినిమా జంట సిద్ధూ మరియు సీరత్ కపూర్ ల కాంబినేషన్ లో రూపొందిన రెండో సినిమా మా వింత గాధ వినుమా కూడా డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, హీరోగానే కాకుండా కథ, డైలాగ్స్, ఎడిటింగ్ మరియు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కూడా మారిన సిద్ధూ మెప్పించాడా లేదా తెలుసు కుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే కాలేజ్ డేస్ లో ఎంతో కష్టపడి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఎలాగోలా లవ్ ప్రపోజ్ చేసి ఒప్పించిన తర్వాత హీరోయిన్ బ్రదర్ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం గోవా వెళ్ళగా అక్కడ ఫుల్లుగా తాగిన ఈ జంట అనుకోకుండా పెళ్లి చేసుకోవడం…

ఆ పెళ్లి చేసుకున్న తీరుని వీడియో తీయడం దాన్ని అప్లోడ్ చేయడం తో ఒక్కసారిగా ఆ వీడియో వైరల్ అవుతుంది, తర్వాత ఇద్దరి లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇద్దరి ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అయ్యాయి తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

చాలా చిన్న కథ అయినా కానీ ఎంటర్ టైన్ మెంట్ వే లో లేదా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా చెబితే ఆడియన్స్ సినిమాను ఆదరిస్తారు. కానీ ఇక్కడ సినిమా కథ చిన్నదే, సినిమా చిన్నదే, అలాగే సినిమాలో ఆకట్టుకునే సన్నివేశాలు కూడా చిన్నవే… సినిమా మొదలు అవ్వడం బాగానే మొదలు అయ్యి కొన్ని అలరించే సన్నివేశాలతో మెప్పించినా కానీ…

40 నిమిషాల తర్వాత నుండి బోర్ కొట్టడం మొదలు అవుతుంది, సీన్స్ వచ్చినవే వస్తూ ఉంటాయి, దాంతో ఒక స్టేజ్ లో చిరాకు కూడా వస్తుంది, ఇక ముగించాలి కాబట్టి ఎలాగోలా ముగించారు అనిపిస్తుంది సినిమా. ఇలాంటి సినిమాలో కథ, డైలాగ్స్, ఎడిటింగ్ మరియు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన హీరో తనవరకు బాగానే నటించి మెప్పించినా కానీ..

కథలో దమ్ము లేకపోవడం అండ్ ఆ కథ మనకు ఏమాత్రం కనెక్ట్ అవ్వక పోవడం తో సిద్ధూ పాత్ర కూడా మనతో కనెక్ట్ కాదు, హీరోయిన్ సీరత్ కపూర్ ఉన్నంతలో బాగానే మెప్పించాగా తనికెళ్ళ భరణి తెలంగాణా యాసతో బాగా అలరించారు. మిగిలిన యాక్టర్స్ కూడా ఉన్నంతలో కొద్దివరకు మెప్పించారు.

సినిమా లెంత్ గంటా 40 నిమిషాలే అయినా కానీ స్క్రీన్ అండ్ ఎడిటింగ్ మొదటి 40 నిమిషాల తర్వాత బోర్ కొట్టించే సీన్స్ తో నిండిపోయింది…. సినిమాటోగ్రఫీ చాలా బాగా మెప్పించాగా, సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది, డైరెక్షన్ పరమ రొటీన్ గా బోర్ కొట్టించే విధంగా ఉందని చెప్పాలి.

అదే రొటీన్ కథని మళ్ళీ మళ్ళీ వాడుకోవడం వీక్ నరేషన్ ఇలా డైరెక్షన్ పరంగా ఆదిత్య మండల ఇంప్రెస్ కేవలం మొదటి 40 నిమిషాల వరకు మాత్రమె చేయగలిగాడు… మొత్తం మీద సినిమా బాగానే మొదలు అయ్యి ముగిసే సరికి ఓ పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ తో ముగుస్తుంది.

మొత్తం మీద అన్ని సినిమాలు చూసేసి ఇంకా చూడటానికి ఏం సినిమా ఉందబ్బా అని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి ఈ సినిమా ని చూసి టైం పాస్ చేయోచ్చు. రెగ్యులర్ మూవీ లవర్స్ సినిమా తో పెద్దగా ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే లేదు… సినిమా ఫైనల్ గా మా రేటింగ్ 2 స్టార్స్

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here