Home న్యూస్ మామా మశ్చీంద్ర రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

మామా మశ్చీంద్ర రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

చాలా టైంగా టాలీవుడ్ హీరోలలో హిట్ కోసం ఎదురు చూస్తున్న యాక్టర్స్ లో సుదీర్ బాబు(Sudheer Babu) ఒకరు…..తను నటించిన మామా మశ్చీంద్ర(Maama Mascheendra) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు…

పెద్దగా అంచనాలు బజ్ ను సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా ట్రైలర్ బాగుండటంతో మినిమం ఎంటర్ టైన్ మెంట్ ఆకట్టుకుంటుంది అనుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే 2 హీరోల మేనమామని తన తండ్రి, తన మేనమామ మోసం చేయడంతో టోటల్ గా మనిషి మారిపోతాడు…అలాంటి మేనమామ లైఫ్ లో తన కూతుళ్ళని తన మేనల్లుళ్ళు ప్రేమిస్తున్నారని తెలుసుకున్న తర్వాత మేనమామ ఎం చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

సినిమా కథ పాయింట్ ఓవరాల్ గా బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా డైరెక్టర్ హర్షవర్ధన్ విఫలం అయ్యాడు. సాగదీసే సీన్స్ తో, కథను డ్రాగ్ చేస్తూ అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మెప్పించినా కూడా చాలా ఓపికతో చూస్తె తప్పితే సినిమా జస్ట్ ఓకే అనిపించేలా ఉంటుంది…

సుదీర్ బాబు డిఫెరెంట్ గెటప్స్ తో ఆకట్టుకున్నాడు, లావు ఉండే రోల్ గెటప్ అస్సలు సూట్ అవ్వలేదు కానీ తన యాక్టింగ్ మాత్రం బాగా మెప్పించగా హీరోయిన్స్ ఇద్దరూ పర్వాలేదు అనిపించగా అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ మెప్పించినా స్క్రీన్ ప్లే ఎడిటింగ్ చాలా నీరసంగా ఉండటం…

పాటలు పెద్దగా మెప్పించక పోవడం, లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలగడం, కథనం చాలా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, ఇలా మైనస్ లు చాలానే ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసి…

చాలా ఓపిక పట్టి చూస్తె సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు…. ట్రైలర్ చూసి సుదీర్ బాబు పక్కాగా హిట్ కొడతాడు అని నమ్మకంతో వెళితే మట్టుకు సినిమా చాలా వరకు నిరాశ పరుస్తుంది… మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here