Home న్యూస్ ఇక రిలీజ్ కాదు అనుకున్నారు…ఏకంగా ఇండియాలో నంబర్ 1 అయ్యింది!

ఇక రిలీజ్ కాదు అనుకున్నారు…ఏకంగా ఇండియాలో నంబర్ 1 అయ్యింది!

5641
0

కోలివుడ్ స్టార్ హీరోలలో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో ఆశించిన సక్సెస్ ను సొంతం చేసుకోలేక పోతున్న హీరోలలో శింభు ఒకరు అని చెప్పాలి. లావుగా ఉన్న హీరో రీసెంట్ గా బాగా బరువు తగ్గి ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ మొదట్లో ఈశ్వరన్ సినిమాతో సందడి చేయగా లేటెస్ట్ గా శింభు నటించిన కొత్త సినిమా మానాడు రిలీజ్ ముందు రోజు…

భారీ హంగామా జరిగింది… ఫైనాన్స్ ఇబ్బందుల వలన సినిమా రిలీజ్ ను ఆపేయాలని డిమాండ్ చేయగా రోజు గడుస్తున్నా ఎలాంటి అప్ డేట్ లేక పోవడంతో సినిమా ఇక పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అందరూ కూడా ఆల్ మోస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత…

ఎలాగోలా చివరి నిమిషంలో పరిస్థితులు సెట్ అవ్వగా లాస్ట్ మినట్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా మొదటి రోజు తమిళనాడు లో 7.8 కోట్లకు పైగా కలెక్షన్స్ తో అల్టిమేట్ ఓపెనింగ్స్ ను అందుకుని దుమ్ము లేపగా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ జోరుని…

మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ 4 రోజుల పాటు సాలిడ్ గా కొనసాగించి ఏకంగా 29 కోట్ల గ్రాస్ ని టోటల్ ఇండియాలో 31.2 కోట్ల కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది… ఇక్కడ విశేషం ఏంటంటే అసలు రిలీజ్ అవుతుందో లేదో అన్న డౌట్ ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియా వైడ్ గా లాస్ట్ వీకెండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని నంబర్ 1 గా నిలవడం అని చెప్పాలి.

సినిమా 3 రోజుల కలెక్షన్స్ 23 కోట్ల గ్రాస్ ను అందుకోగా 4 రోజుల కలెక్షన్స్ 31.2 కోట్లను అందుకున్నాయి. ఇక రెండో ప్లేస్ లో సల్మాన్ ఖాన్ నటించిన స్పెషల్ రోల్ మూవీ అంతిమ్ 21 కోట్లను అందుకోగా ఆ సినిమా కన్నా చాలా లిమిటెడ్ గానే రిలీజ్ అయిన మానాడు 4 రోజుల్లో అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది. సినిమా తెలుగు డబ్ రిలీజ్ త్వరలోనే జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here