Home న్యూస్ విజయ్ ఆంటోని ‘మార్గన్’ టాక్ ఏంటి…హిట్టా-ఫట్టా!!

విజయ్ ఆంటోని ‘మార్గన్’ టాక్ ఏంటి…హిట్టా-ఫట్టా!!

0

బిచ్చగాడు సినిమాతో తెలుగు లో మంచి పేరు సొంతం చేసుకున్న తమిళ్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) తర్వాత టైంలో తను చేసే ప్రతీ తమిళ్ సినిమాను తెలుగు లో రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు, కొన్ని పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసినా చాలా వరకు అంచనాలను అందుకోలేదు. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ మార్గన్(Maargan Movie) తో…

వచ్చేశాడు…మరి ఈ సినిమా ఎలా ఉంది…ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే హీరో కూతురిని ఎవరో చంపేస్తారు…శరీరం అంతా కాలిపోయినట్లుగా ఉంటుంది…అదే విధంగా మరో హత్య జరుగుతుంది..

దాంతో దీని వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి హీరో చేసిన ప్రయత్నం ఏంటి…ఈ ప్రయత్నంలో తను తెలుసుకున్న నిజాలు ఏంటి అనేది మొత్తం మీద సినిమా కథ పాయింట్…కథ పాయింట్ రొటీన్ గానే ఉన్నప్పటికీ కూడా ఫస్టాఫ్ వరకు సినిమా బాగానే సాగింది…

ప్రజెంట్ అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను మిక్స్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ ను బాగానే డీల్ చేశారు అనిపించేలా సాగే ఫస్టాఫ్ ఆసక్తి కరమైన పాయింట్ తో ఇంటర్వెల్ పడుతుంది…ఇక అక్కడ నుండి మాత్రం సినిమా గాడి తప్పినట్లు అనిపించింది…ఎటు నుండి ఎటో వెళ్ళే కథ…

డ్రాగ్ అవుతూ సాగుతుంది…దాంతో ఫస్టాఫ్ ఇచ్చిన డీసెంట్ ఇంప్రెషన్ సెకెండ్ ఆఫ్ లో తగ్గుతూ వచ్చింది…మళ్ళీ క్లైమాక్స్ పర్వాలేదు అనిపించేలా ఉండటంతో ఓవరాల్ గా మరీ సూపర్ అని కాదు కానీ ఉన్నంతలో కొంచం డ్రాగ్ అయినా పర్వాలేదు అనిపించేలా సినిమా ఎండ్ అవుతుంది.

విజయ్ ఆంటోని మరోసారి మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి బాగానే ప్లస్ అయింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరింత టైట్ గా సెకెండ్ ఆఫ్ లో రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఓవరాల్ గా మరీ ఓవర్  ఎక్స్ పెర్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా…

సినిమా చూడటం మొదలు పెడితే ఫస్టాఫ్ బాగుంది అనిపించేలా సెకెండ్ ఆఫ్ యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు… ఓవరాల్ గా సినిమా ఒకసారి చూసే విధంగా ఉందని చెప్పాలి….మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here