బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) మొదటి పార్ట్ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని సీక్వెల్ మూవీ కేవలం మొదటి రోజే ఆల్ మోస్ట్ అందుకోగా….
రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో కుమ్మేస్తున్న సినిమా రెండో రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి దుమ్ము లేపగా బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేస్తూ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా రెండో రోజు టైంకే ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాని కంప్లీట్ చేసుకుంది.
సినిమా మొత్తం మీద రెండో రోజు సాధించిన కలెక్షన్స్ తో ఓవర్సీస్ ఏరియాలో వాల్యూ బ్రేక్ ఈవెన్ ని దాటేసి ఇప్పుడు లాభాలను కూడా సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. టోటల్ ఓవర్సీస్ లో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 3.50 కోట్ల రేంజ్ లో ఉండగా…
సినిమా మొదటి రోజే ఆల్ మోస్ట్ 3.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని బిజినెస్ మీద మైనస్ ప్రాఫిట్స్ ను అందుకోగా రెండో రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసిన సినిమా లాభాలను సొంతం చేసుకుని ఇక్కడ సూపర్ డూపర్ హిట్ గా దూసుకు పోతుంది.
ఇక ఓవరాల్ గా బిజినెస్ ను వీకెండ్ లోపే అందుకోవడానికి సిద్ధం అవుతున్న సినిమా లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ లాభాలను కూడా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి లాంగ్ రన్ లో బిజినెస్ మీద సినిమా ఏ రేంజ్ లో లాభాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.