రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) మీద అంచనాలు సాలిడ్ గానే ఉన్నాయి…సమ్మర్ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో మాస్ కుమ్ముడు కుమ్మేయడం…
ఖాయమని చెప్పాలి…ఇక మొదటి పార్ట్ తో పోల్చితే రెండో పార్ట్ బిజినెస్ కూడా ఎక్స్ లెంట్ గా జరగడం విశేషం అని చెప్పాలి. మొదటి పార్ట్ కి మొత్తం మీద 2.50 కోట్ల రేంజ్ లో టోటల్ బిజినెస్ జరిగింది. టోటల్ రన్ లో 9.60 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…
కానీ ఇప్పుడు పార్ట్ 2 కి రిమార్కబుల్ బిజినెస్ సొంతం అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. నైజాం ఏరియాలో వాల్యూ బిజినెస్ రేంజ్ 6.50 కోట్ల దాకా సొంతం చేసుకున్న ఈ సినిమా…
ఆంధ్ర రీజన్ లో 7 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా సీడెడ్ లో 2 కోట్ల మేర బిజినెస్ ను సాధించగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 15.50 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2 కోట్ల వరకు బిజినెస్ ను అందుకోగా…
టోటల్ ఓవర్సీస్ లో 3.5 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది…దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ 21 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ 2.5 కోట్ల బిజినెస్ ను అందుకుంటే రెండో పార్ట్ ఆల్ మోస్ట్ 8 రెట్లకు పైగా…
బిజినెస్ ను ఇప్పుడు సొంతం చేసుకోవడం విశేషం కాగా…బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఇప్పుడు మినిమమ్ 22 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సమ్మర్ రేసులో ఇతర సినిమాల పోటిలో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.