Home న్యూస్ మ్యాడ్ 2.5 కోట్లు….మ్యాడ్2 ఒక్క నైజాం బిజినెస్ ఎంతో తెలుసా!!

మ్యాడ్ 2.5 కోట్లు….మ్యాడ్2 ఒక్క నైజాం బిజినెస్ ఎంతో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న సినిమాల్లో రెండేళ్ళ క్రితం చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) మీద అంచనాలు సాలిడ్ గా ఉండగా…

సినిమా రిలీజ్ ఇంకో వారంలో ఉండగా బిజినెస్ పరంగా కూడా కుమ్మేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ కాక ముందే బిజినెస్ పరంగా దుమ్ము దులిపెస్తుంది. రెండేళ్ళ క్రితం వచ్చిన మ్యాడ్ మూవీ ఓవరాల్ గా 2.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా….

టోటల్ రన్ లో 9.60 కోట్ల షేర్ ని దాటింది….ఆ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ తో పోల్చితే ఇప్పుడు సాలిడ్ క్రేజ్ నడుమ రిలీజ్ కాబోతున్న మ్యాడ్2 మూవీ ఒక్క నైజాం ఏరియాలోనే సెన్సేషనల్ రేటుని సొంతం చేసుకుని కుమ్మేయడం విశేషం…

నైజాం ఏరియాలో సినిమా వాల్యూ బిజినెస్ 6.50 కోట్ల దాకా ఉందని సమాచారం…అంటే మ్యాడ్ టోటల్ బిజినెస్ మీద ఏకంగా 4 కోట్ల ఎక్కువ రేటుని ఒక్క నైజాం ఏరియాలనే సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది మ్యాడ్2 మూవీ…ఈ సమ్మర్ లో ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని..

సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా…టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ పరంగా కూడా మాస్ కొట్టుడు కొట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా మొదటి పార్ట్ రేంజ్ లో సినిమా రెండో పార్ట్ ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక ఎక్స్ లెంట్ కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here