Home న్యూస్ మ్యాడ్ 2 మూవీ ప్రీమియర్స్ షో రివ్యూ…..హిట్టా-ఫట్టా!!

మ్యాడ్ 2 మూవీ ప్రీమియర్స్ షో రివ్యూ…..హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) యూత్ లో మంచి క్రేజ్ ను ఆల్ రెడీ సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అయిన సినిమా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకోగా…

అక్కడ నుండి మొదటి టాక్ బయటికి వచ్చేసింది. సినిమా స్టోరీ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి లడ్డూకి పెళ్లికి వెళతారు…అక్కడ పెళ్లిలో హంగామా తర్వాత అందరూ కలిసి గోవా వెళ్లిన తర్వాత ఏం జరిగింది అన్నది అసలు సిసలు కథ…

లాజిక్ లు కథలు వెతకకుండా జస్ట్ ఎంటర్ టైన్ మెంట్ తోనే మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు నవ్వించడమేపనిగా పెట్టుకున్న టీం చాలా వరకు సక్సెస్ అయ్యారు… స్టోరీ పాయింట్ కొంచం ఈజీగానే గెస్ చేసేలా ఉన్నప్పటికీ ప్రతీ సీన్ కూడా కామెడీ టచ్ తో ఆకట్టుకుంటూ..

ఫస్టాఫ్ చాలా వరకు కామెడీ సీన్స్ తో వర్కౌట్ అవ్వగా ఇంటర్వెల్ ఎపిసోడ్ హిలేరియస్ గా వర్కౌట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా…సెకెండ్ ఆఫ్ కూడా అదే టెంపోని మెయిన్ టైన్ చేసినా అక్కడక్కడా కొంచం స్లో అయినట్లు అనిపించినా కూడా మళ్ళీ ప్రీ..

క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు కామెడీ వర్కౌట్ అవ్వడంతో సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆడియన్స్ ఓ మంచి ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ తో బయటికి రావడం ఖాయమని చెప్పాలి. ముందే చెప్పినట్లు కథ గురించి పట్టించుకోకుండా జస్ట్ కామెడీ కోసం వెళ్ళే ఆడియన్స్ కి…

చాలా వరకు సాటిస్ ఫై చేస్తుంది మ్యాడ్2 మూవీ…దానికి తోడూ ఉన్న రెండు మూడు పాటలు కూడా బాగా వర్కౌట్ అవ్వడంతో సాంగ్స్ విషయంలో కూడా పెద్దగా బోర్ ఏమి అనిపించలేదు… ఓవరాల్ గా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో సెకెండ్ ఆఫ్ కూడా ఆల్ మోస్ట్…

ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించగా…సినిమా కంప్లీట్ అయ్యే టైంకి ఎబో యావరేజ్ రేంజ్ కి ఏమాత్రం తీసిపోని మూవీలా అనిపించింది మ్యాడ్2 మూవీ…ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యే టైం కి మంచి టాక్ నే సొంతం చేసుకున్న సినిమా…

ఇక రెగ్యులర్ షోలకు యూత్ అండ్ కామన్ ఆడియన్స్ నుండి ఇంకా బెటర్ టాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా మ్యాడ్2 మూవీ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఏ రేంజ్ లో కుమ్ముతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here