రెండేళ్ళ క్రితం పెద్దగా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) మీద యూత్ లో మంచి అంచనాలు ఏర్పడగా సినిమా ట్రైలర్ తో కానీ సాంగ్స్ తో కానీ ట్రేడ్ లో మంచి బజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయ్యింది.
ఇక రిలీజ్ అయ్యాక ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…. ముందుగా కథ పాయింట్ కి వస్తే సినిమా ఓపెన్ అవ్వడం తీహార్ జైలు లో లడ్డూ తన కథ చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. ముగ్గురు ఫ్రెండ్స్ తన పెళ్లిలో చేసిన హంగామా…
ఎక్కడ దాకా వెళ్ళింది…ఆ కథ ఏంటి అనేది సినిమా ఓవరాల్ గా స్టోరీ పాయింట్…. పెద్దగా స్టోరీ ఏమి లేకుండా సింపుల్ లైన్ తో వచ్చిన మ్యాడ్2 సినిమా కథ ఏమి లేక పోయినా కూడా సింగిల్ లైన్ పంచులు ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ తో నిండిపోయింది. కానీ మొదటి పార్ట్ లో ఉన్నంత…
జెన్యూన్ కామెడీ లేదు కానీ పర్వాలేదు అనిపించేలా కామెడీ వర్కౌట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ లో సునీల్ కామెడీ బాగా ప్లస్ అయ్యింది. ఇక ముగ్గురు హీరోలు మరోసారి ఆకట్టుకోగా సంగీత్ శోభన్ మరోసారి తన దైన డైలాగ్స్ తో కామెడీతో కుమ్మేశాడు. నార్నే నితిన్ మరియు రామ్ నితిన్ లు పర్వాలేదు అనిపించగా…
లడ్డూ రోల్ మరోసారి సినిమాలో హైలెట్ గా నిలిచింది. మిగిలిన రోల్స్ అన్నీ కూడా ఉన్నంతలో చిన్న చిన్న రోల్స్ లో ఆకట్టుకున్నారు. సాంగ్స్ ఉన్నవి తక్కువే అయినా కూడా సినిమాలో మేజర్ హైలెట్స్ లో ఒకటిగా నిలిచాయు… ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో పర్వాలేదు అనిపించగా…
సెకెండ్ ఆఫ్ లో కొంచం స్లో అవుతున్న టైంలో తిరిగి సునీల్ ట్రాక్ తో మళ్ళీ జోరు అందుకుని పర్వాలేదు అనిపించేలా సాగుతుంది. సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే మెప్పించాయి. ఇక డైరెక్టర్ ఈ సారి కథ అంటూ ఏమి ఉండదని….సింపుల్ గా నవ్వుకోవడానికి…
తమ సినిమా చూడాలి అంటూ ముందే చెప్పగా…అటూ మ్యాడ్ మూవీ లా జెన్యూన్ కామెడీ లా కాకుండా అలా అని మరీ ఫోర్స్ కామెడీ అని కూడా కాకుండా మిడిల్ లో మ్యాడ్2 కామెడీ సీన్స్ తో మెప్పించింది అని చెప్పాలి. కొన్ని చోట్ల సీన్స్ హిలేరియస్ గానే అనిపించగా…కొన్ని చోట్ల ఓకే అనిపించగా…
ఎక్కడా కూడా బోర్ ఏమి అనిపించకుండా రెండు గంటలు టైం పాస్ కోసం చూసేలా సినిమా ఉంటుంది అని చెప్పాలి. మరీ ఓవర్ అంచనాలతో కాకుండా నార్మల్ గా థియేటర్స్ కి వెళితే మట్టుకు ఈజీగా ఒకసారి చూడొచ్చు. ఫ్రెండ్స్ గ్యాంగ్ తో వెళితే ఇంకా బెటర్ గా ఎంజాయ్ చేయోచ్చు. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….