రెండేళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకు పెద్దగా అంచనాలతో ఏమి రాకపోయినా కూడా రిలీజ్ అయిన తర్వాత సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుని కుమ్మేసిన మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) మీద అంచనాలు సాలిడ్ గానే ఉండగా…సినిమా కూడా ఆ అంచనాలను అందుకునే రేంజ్ లోనే…
మెప్పించేలా ఆడియన్స్ ముందుకు రాబోతుంది…రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ఫుల్ ఆన్ కామెడీ సీన్స్ తో నిండిపోయిన ఈ ట్రైలర్ సినిమా మీద మరింత అంచనాలను అయితే ఇప్పుడు పెంచేసింది…
కథ లాంటివి పెద్దగా పట్టించుకోకుండా జస్ట్ ఎంటర్ టైన్ మెంట్ కోసమే సినిమా చూడటానికి రావాలి అంటూ టీం ఆల్ రెడీ చెప్పగా ట్రైలర్ లో స్టోరీ పాయింట్ ను అలా సింపుల్ గా చెప్పి వదిలేశారు…లడ్డూకి పెళ్లి సెట్ అవ్వడంతో ఫ్రెండ్స్ అందరూ…
పెళ్లికి వెళ్ళాలని ఫిక్స్ అయిన తర్వాత పెళ్ళికొడుకుతో కలిసి గోవా ప్లాన్ చేసే హీరో గ్యాంగ్ తర్వాత ఏ రేంజ్ కామెడీ తో మెప్పించారు అన్నది కథ పాయింట్ కాగా…సింగిల్ లైన్ పంచులతో నిండిపోయిన ట్రైలర్ ఆద్యంతం కామెడీ ఎక్కడా తగ్గకుండా మెప్పించింది అని చెప్పాలి…
బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా మెప్పించగా…మరీ హిలేరియస్ లెవల్ లో కాకపోయినా కూడా సింగిల్ లైన్ పంచులతో నిండిపోయిన మ్యాడ్2 మూవీ ట్రైలర్ ఫుల్ మార్కులు అయితే ఇక్కడ సొంతం చేసుకోగా… సినిమా కూడా ట్రైలర్ రేంజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటే…
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్స్ జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. మొదటి పార్ట్ రేంజ్ కి మించే లెవల్ లోనే సినిమా ఉంటుంది అని టీం చెబుతూ ఉండటంతో అది నిజం అయితే ఇక సమ్మర్ లో ఈ సినిమా రచ్చ మరో లెవల్ లో ఉండటం ఖాయమని చెప్పొచ్చు.