బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ లోనే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని మాస్ ఊచకోత కోసిన మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) 3 రోజుల్లోనే 40 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా… ఇప్పుడు 4వ రోజున సినిమాకి రంజాన్ పండగ అడ్వాంటేజ్ కూడా…
లభించడంతో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను కొనసాగిస్తూ దుమ్ము లేపుతూ లాభాలను ఇంకా పెంచుకునే పనిలో దూసుకు పోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజుతో పోల్చితే డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉండగా నైజాం లో మరోసారి మంచి హోల్డ్ ని…
చూపెడుతున్న సినిమా ఆంధ్ర సీడెడ్ లలో కూడా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా…ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 3.6-3.8 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉండగా. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే…
షేర్ లెక్క 4 కోట్ల మార్క్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా తో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి హోల్డ్ నే చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా సినిమా 4వ రోజున ఇప్పుడు 4.5 కోట్ల రేంజ్ నుండి…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ కుమ్ముడు కుమ్మేస్తూ దూసుకు పోతున్న మ్యాడ్2 మూవీ ఇప్పుడు టోటల్ గా 4 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.