బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వాల్సిన టైం కన్నా లేట్ అవుతూ ఉంటాయి, కానీ ఏకంగా నిర్మాణం అయిన 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవ్వడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది…అలా రిలీజ్ అయినా కూడా ఆడియన్స్ ను అలరిస్తుందో లేదో అన్నది కూడా క్లారిటీ లేదు, కానీ రీసెంట్ గా తమిళ్ లో 12 ఏళ్ల క్రితం విశాల్(Vishal) నటించిన మదగజరాజ మూవీ…
ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పుడు తెలుగు లో డబ్ అయ్యి గ్రాండ్ గానే రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ..ముందుగా కథ పాయింట్ కి వస్తే…
తన ఫ్రెండ్స్ తో హ్యాప్పీగా ఎంజాయ్ చేసే హీరో ఫ్రెండ్స్ లైఫ్ తో విలన్ సోనూ సూద్ ఆడుకుంటాడు…దాంతో హీరో ఎలా విలన్ మీద పగ తీర్చుకున్నాడు అన్నది బేసిక్ స్టోరీ పాయింట్..12 ఏళ్ల క్రితం రూపొందిన సినిమా స్టోరీ పాయింట్ అప్పటికే చాలా నార్మల్ గా ఉండగా…
ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ కి కంప్లీట్ గా ఔట్ డేటెడ్ కథ అని చెప్పొచ్చు…కానీ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ రొటీన్ గానే ఉన్నా కూడా చాలా చోట్ల వర్కౌట్ అవ్వడంతో కథ రొటీన్ గానే ఉన్నా కూడా ఈజీగా ఒకసారి చూసేలా అనిపిస్తుంది సినిమా..
విశాల్ మాస్ యాక్షన్ సీన్స్, హీరోయిజం ఎలివేట్ సీన్స్ మెప్పించగా సంతానం కామెడీ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్…విశాల్ సంతానంల కామెడీ సీన్స్ సినిమాలో మేజర్ హైలెట్స్ అని చెప్పాలి. ఇక హీరోయిన్స్ ఇద్దరూ పరమ రొటీన్ రోల్స్ లో బిలో పార్ గా అనిపించగా…
మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించగా, కొన్ని చోట్ల డబ్బింగ్ అనుకున్న రేంజ్ లో సెట్ అవ్వలేదు అనిపించింది, స్క్రీన్ ప్లే కూడా కొంచం రొటీన్ గానే ఉన్నా కూడా ఓవరాల్ గా కామెడీ కోసం ఈజీగా ఒకసారి చూసేలా ఉందని చెప్పాలి మద గజ రాజ సినిమా…
12 ఏళ్ల క్రితం రావాల్సిన కంటెంట్ ఇప్పటి ఆడియన్స్ కి మరీ అనుకున్న రేంజ్ లో కాక పోయినా కూడా కామెడీ సీన్స్ పరంగా పర్వాలేదు అనిపించేలా మెప్పించడంతో పెద్దగా అంచనాలు ఏమి పెట్టుకోకుండా చూసే ఆడియన్స్ కి ఈజీగా ఒకసారి చూసేలా ఉంది సినిమా…సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్….