2015 టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన మాడ్ మాక్స్ అనే సినిమా ఓ రేంజ్ లో సంచలనం సృష్టించింది. భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా కూడా నిలిచింది. ఇండియాలో సైతం ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోగా ఆ సినిమా వచ్చిన ఆల్ మోస్ట్ 9 ఏళ్లకి ఆ సినిమాకి ప్రీక్వెల్ గా మాడ్ మాక్స్: ఫ్యూరియోసా(Mad Max Furiosa – A Mad Max Saga Movie) మూవీ రిలీజ్ అయింది…
ఈ సినిమా ఈ ఇయర్ హాలీవుడ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ అవ్వడంతో రికార్డులు క్రియేట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. సినిమాకి మంచి రివ్యూలే ఆడియన్స్ నుండి సొంతం అయ్యాయి…దాంతో మంచి కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు.. కానీ రెండో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా…
తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…ఇక అమెరికాలో ఓవరాల్ గా రెండో వీకెండ్ అయ్యే టైంకి 50 మిలియన్ డాలర్స్ లోపు మాత్రమే వసూల్ చేసిన ఈ సినిమా ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 415 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను వసూల్ చేయగా ఓవర్సీస్ మొత్తం మీద సినిమా 64.5 మిలియన్ డాలర్స్ ను వసూల్ చేసింది పర్వాలేదు అనిపించింది…
ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 535 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను వసూల్ చేయగా, టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా రెండో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి 114.5 మిలియన్ డాలర్స్ ను వసూల్ చేయగా ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 950 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంది…. కానీ సినిమా బడ్జెట్ మాత్రం ఆల్ మోస్ట్ 170 మిలియన్ డాలర్స్ అని అంటున్నారు…
అంటే ఇండియన్ కరెన్సీలో 1410 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన క్రేజీ బ్లాక్ బస్టర్ సీక్వెల్ మూవీ రెండో వీకెండ్ అయ్యే టైంకి 950 కోట్లు మాత్రమే వసూల్ చేసి నిరాశ పరిచింది. లాంగ్ రన్ లో బడ్జెట్ రికవరీ కూడా ఇప్పుడు కష్టమే అంటూ ఉండటంతో సినిమా నిరాశ పరిచింది అని చెప్పాలి. ఇండియాలో కూడా 15 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ తో సరిపెట్టుకుంది ఈ సినిమా…