బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ మొదలు అయ్యింది. టాలీవుడ్ నుండి మంచి బజ్ ఉన్న సినిమాలు వరుసగా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా….ముందుగా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు డీసెంట్ బజ్ నడుమ మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవ్వగా…
వరల్డ్ వైడ్ గా 21 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 22 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ చేయగా… బుకింగ్స్ ట్రెండ్ మరీ అద్బుతం అని కాదు కానీ…
ఉన్నంతలో మేజర్ సెంటర్స్ లో మంచి జోరుని చూపెడుతున్న సినిమా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇండియాలో ఆల్ మోస్ట్ 2.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని క్రాస్ చేయగా ఓవర్సీస్ లో జరిగిన గ్రాస్ బుకింగ్స్ తో సినిమా ఆల్ మోస్ట్ టోటల్ గా…
5 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 650 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గానే ఉండటంతో పాటు…
సినిమా మీద ఓవరాల్ గా మంచి బజ్ కూడా ఉండటంతో టాక్ డీసెంట్ గా ఉన్నా చాలు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో సినిమా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఓపెనింగ్స్ పరంగా టాక్ బాగుంటే పోటి ఉన్నా కూడా మినిమమ్ 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే…
అవకాశం సినిమా కి ఎంతైనా ఉండగా తర్వాత టాక్ సూపర్ పాజిటివ్ గా ఉంటే కనుక కలెక్షన్స్ పరంగా అంచనాలను సినిమా మరింతగా మించే అవకాశం ఉంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ తో కుమ్మేస్తుందో చూడాలి…