Home న్యూస్ మ్యాడ్ స్క్వేర్ టీసర్ రివ్యూ….బ్లాక్ బస్టర్ బొమ్మ…ఖాయం!!

మ్యాడ్ స్క్వేర్ టీసర్ రివ్యూ….బ్లాక్ బస్టర్ బొమ్మ…ఖాయం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం పెద్దగా అంచనాలు ఏమి లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి ఆడియన్స్ ను యూత్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది మ్యాడ్ మూవీ…చిన్న సినిమానే అయినా కూడా 2.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 7.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

తర్వాత డిజిటల్ లో సూపర్ సక్సెస్ గా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్(MAD Square Movie) మూవీ రూపొందగా ఆడియన్స్ ముందుకు ఈ సినిమా సమ్మర్ కానుకగా మార్చ్ 29న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…రీసెంట్ గా సినిమా…

అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు..కాగా టీసర్ చూసిన తర్వాత సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో అన్నది కొంచం క్లారిటీ వచ్చిందని చెప్పాలి. సినిమా టీసర్ కి వచ్చిన రేంజ్ లో రెస్పాన్స్ సినిమా రిలీజ్ అయిన ఇదే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకుంటే….

కచ్చితంగా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టీసర్ లో సినిమా కథ ఎలా ఉండబోతుందో ఆల్ మోస్ట్ చెప్పారు….సినిమాలో లడ్డూ క్యారెక్టర్ కి పెళ్లి సెట్ అయిన తర్వాత ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఆ పెళ్లికి అటెండ్ అయిన తర్వాత…

చేసిన హంగామా ఏంటి ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా స్టోరీ పాయింట్ గా తీసుకోగా హిలేరియస్ కామెడీ సీన్స్ అన్ ఎక్స్ లెంట్ సాంగ్స్ తో సినిమా ఉండబోతుందని టీసర్ లో చెప్పకనే చెప్పారు. ఎంటర్ టైన్ మెంట్ వైజ్ సినిమా మొదటి పార్ట్ కి మించి…

రెండో పార్ట్ కామెడీ బాగా వర్కౌట్ అయిందని చెబుతూ ఉండగా టీసర్ చూస్తుంటే అదే నిజం అయ్యేలా ఉంది. సినిమా వచ్చాక ఇదే నిజం అయ్యి ఎంటర్ టైన్ అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి పార్ట్ కి రెండు మూడు రెట్ల కలెక్షన్స్ ని అవాలీలగా అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here