సమ్మర్ స్టార్టింగ్ లో టాలీవుడ్ కి సాలిడ్ స్టార్ట్ దక్కేలా చేసిన సినిమా మ్యాడ్2(Mad Square Movie) సినిమా….మొదటి పార్ట్ మంచి సక్సెస్ గా నిలవగా రెండో పార్ట్ మీద క్రేజ్ భారీగా పెరిగిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి బజ్ నడుమ రిలీజ్ అయిన సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకోగా టాక్ మరీ మొదటి పార్ట్ రేంజ్ లో….
సొంతం కాక పోయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుని సాలిడ్ లాభాలను కూడా దక్కించుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది. మొదటి పార్ట్ కి ఎన్నో రెట్లు మించే రేంజ్ లో…
వసూళ్ళ రచ్చ లేపిన ఈ సినిమా సమ్మర్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది… 22 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన మ్యాడ్ 2 మూవీ ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
MAD Square Movie Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 13.70Cr
👉Ceeded: 3.93Cr
👉UA: 3.90Cr
👉East: 2.30Cr
👉West: 1.25Cr
👉Guntur: 2.15Cr
👉Krishna: 1.80Cr
👉Nellore: 1.08Cr
AP-TG Total:- 30.11CR(51.05CR~ Gross)
👉KA+ROI: 2.20Cr
👉OS – 6.30Cr****approx
Total WW Collections: 38.61CR(Gross – 70.00CR~)
మొత్తం మీద 22 కోట్ల టార్గెట్ మీద టోటల్ రన్ లో 16.61 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది….మొదటి పార్ట్ రేంజ్ లో టాక్ కనుక సొంతం అయ్యి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 50 కోట్ల రేంజ్ షేర్ మార్క్ ని టార్గెట్ చేసి ఉండేది కానీ ఉన్నంతలో మంచి లాభాలతో రన్ ని కంప్లీట్ చేసుకుంది.