జపాన్ ని ఊపేస్తున్న మగధీర!…పీక్స్ లో క్రేజ్

0
1717

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రెండో సినిమా మగధీర ఇక్కడ ఎలాంటి భీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే…ఇప్పుడు సినిమా జపాన్ లో కూడా ఓ రేంజ్ లో సెంసేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. సినిమా 10 రోజుల్లో అక్కడ 17.45 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

అక్కడ ఆడియన్స్ సినిమాను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా హాల్లలో స్పెషల్ ఫోటోషూట్స్ తో, మగధీర స్టైల్ లో గెటప్స్ తో సినిమా క్రేజ్ ని మరింతగా పెంచేస్తు సినిమాకి మరింత పబ్లిసిటీని తెప్పిస్తున్నారు. దాంతో కలెక్షన్స్ పరంగా మరిన్ని రికార్డులు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇప్పటికే ఇండియన్ సినిమాల పరంగా జపాన్ లో ఆల్ టైమ్ రికార్డులు నమోదు చేసిన సినిమాగా మగధీర సరికొత్త చరిత్ర సృష్టించింది. అక్కడ సినిమా క్రేజ్ చూస్తుంటే టోటల్ రన్ లో మరిన్ని అద్బుతాలు నమోదు అయినా ఆశ్యర్యపోనవసరం లేదని చెబుతుండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!