Home న్యూస్ మహా సముద్రం రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

మహా సముద్రం రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

శర్వానంద్ సిద్దార్థ్ ల కాంబినేషన్ లో అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మహా సముద్రం ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ ను సొంతం చేసుకుంది, చాలా కాలంగా హిట్ కి దూరం అయిన శర్వా మరియు సిద్దార్థ్ లు ఈ సినిమా తో ఎంతవరకు ఆకట్టుకున్నారు, డైరెక్టర్ అజయ్ భూపతి RX100 హిట్ జోరు ని ఈ సినిమాతో కొనసాగించాడా లేదా తెలుసు కుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే సినిమా ఓపెన్ అవ్వడం ఫ్లాష్ బ్యాక్ తో ఓపెన్ అవ్వగా శర్వానంద్ మరియు సిద్దార్థ్ ఇద్దరూ ఫ్రెండ్స్… శర్వానంద్ దుడుకు స్వభావం, సిద్దార్థ్ పోలిస్ అవ్వాలని ప్రిపేర్ అవుతూ గొడవలకు దూరం ఉంటూ వస్తాడు… సిద్దార్థ్ కి చుంచుమామ అయిన జగపతిబాబు అంటే ఇష్టం ఉండదు…

శర్వానంద్ ప్రేమించిన అమ్మాయి అను ఎమాన్యుఎల్ లాయర్ అవ్వడానికి ప్రిపేర్ అవుతూ ఉండగా సిద్దార్థ్ ప్రేమించిన అమ్మాయి అదితిరావ్ హైదరి డాన్స్ టీచర్ గా చేస్తుంది… గొడవలకు దూరంగా ఉండే సిద్దార్థ్ అనుకోకుండా ఒక గొడవలో ఇన్వాల్వ్ అవుతాడు, తర్వాత జగపతిబాబు సిద్దార్థ్ ని ఊరు విడిచి వెళ్ళమని చెప్పగా…

విలన్ బ్యాచ్ అదితిరావ్ హైదరిని టార్గెట్ చేయగా తనని కాపడానికి శర్వానంద్ ఏం చేశాడు… తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి…అన్నది సినిమా లో అసలు సిసలు కథ… కథ పాయింట్ బాగున్నా చెప్పిన విధానం నెమ్మదిగా ఉంటుంది…ఫస్టాఫ్ వరకు క్యారెక్టర్ల పరిచయం కోసం ఎక్కువ టైం తీసుకోకుండా చకచకా అందరినీని ఫస్ట్ 15 నిమిషాల్లోనే పరిచయం చేసినా అసలు కథలో వెళ్ళడానికి కొంచం టైం పట్టింది.

కానీ కథ లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్ వరకు బాగా కొనసాగిన సినిమా ఇంటర్వెల్ పాయింట్ కి పీక్ టైం కి వెళ్లి శర్వానంద్ కెరీర్ లో బెస్ట్ ఫైట్ సీన్ గా అనిపించి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచుతుంది… కానీ సెకెండ్ ఆఫ్ ఆ అంచనాలను తగ్గట్లు కాకుండా వేరే ట్రాక్ తీసుకుని వెళుతుంది, అలా అని మరీ బోర్ ఏమి కొట్టదు కానీ ఫస్ట్ ఆఫ్ సగం నుండి ఇంటర్వెల్ వరకు ఉన్న కిక్ తగ్గుతుంది…

పెర్ఫార్మెన్స్ పరంగా శర్వానంద్ అద్బుతంగా నటించగా కొన్ని సీన్స్ తన కెరీర్ బెస్ట్ గా చెప్పుకోవచ్చు, సిద్దార్థ్ మంచి ఈజ్ తో నటించి మెప్పించాడు, ఇద్దరు హీరోయిన్స్ పర్వాలేదు కానీ అదితి రావ్ హైదరీ కొంచం ఎక్కువ స్కోప్ దొరికింది, జగపతిబాబు మాస్ టచ్ ఉన్న రోల్ లో బాగా ఆకట్టుకోగా రావ్ రమేష్ తన డైలాగ్స్ తో మెస్మరైజ్ చేశాడు…తన యాక్టింగ్ అద్బుతం అని చెప్పాలి.

చేతన్ భరద్వాజ్ సంగీతం పర్వాలేదు అనిపించినా మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది… కొన్ని వీక్ సీన్స్ ని కూడా తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్న మణిశర్మ ఎలివేషన్ సీన్స్ కి ఇంకా రెచ్చిపోయాడు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్ గానే ఉండగా డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించగా… డైరెక్షన్ విషయానికి వస్తే అజయ్ భూపతి ఫస్టాఫ్ వరకు…

మంచి ఇంటెన్స్ స్టొరీని ఆకట్టుకునేలా చెప్పి ఇంటర్వెల్ టైం కి ఫుల్ జోష్ ఇచ్చాడు కానీ సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పాడు… కథ డీవియేట్ చేసి కొత్త మలుపులోకి తీసుకెళ్ళి స్క్రీన్ ప్లే కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేశాడు, సెకెండ్ ఆఫ్ చాలా కథ ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉండగా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఆడియన్స్ RX100 రేంజ్ ట్విస్ట్ లు ఎక్స్ పెర్ట్ చేస్తే నార్మల్ గానే ముగించాడు…

మొత్తం మీద సినిమా ఫస్టాఫ్ ఇచ్చిన జోష్ సెకెండ్ ఆఫ్ క్యారీ చేయలేక పోయినా ఓవరాల్ గా డీసెంట్ మూవీ గా నిలిచింది, సెకెండ్ ఆఫ్ కథ ప్రిడిక్ట్ చేసేలా ఉన్న లెంత్ కొంచం ఎక్కువ అయినట్లు అనిపించినా ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు రెగ్యులర్ మాస్ మూవీస్ నచ్చే వాళ్లకి సినిమా నచ్చుతుంది. నార్మల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకి సినిమా యావరేజ్ టు ఎబో యావరేజ్ గా అనిపించవచ్చు. సినిమా కి ఫైనల్ గా మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here