Home న్యూస్ మహా సముద్రం ట్రైలర్ రివ్యూ…బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉంది!!

మహా సముద్రం ట్రైలర్ రివ్యూ…బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉంది!!

920
0

వరుస ఫ్లాఫుల్లో ఉన్న శర్వానంద్, తెలుగు లో స్ట్రైట్ మూవీ చేసి చాలా కాలం అయిన సిద్దార్థ్ కలిసి RX100 డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా మహా సముద్రం, బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా బరిలో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు, ట్రైలర్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యేలా కనిపిస్తుంది అని చెప్పొచ్చు.

ఇద్దరు మామూలు వ్యక్తులు అయిన హీరోలు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో హీరోయిన్స్ తో ప్రేమలో ఉండగా లైఫ్ లో జరిగిన కొన్ని ఇంసిడెంట్ ల కారణంగా గ్యాంగ్ స్టర్స్ అవుతారు… ఇక వాళ్ళ లైఫ్ లో తర్వాత ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి….

హీరోయిన్స్ అదితి రావ్ హైదరీ మరియు అను ఎమాన్యుఎల్ ల రోల్స్ ఏంటి, జగపతిబాబు మరియు రావ్ రమేష్ ల పాత్రల గురించి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే, విజువల్స్ కానీ స్టార్ కాస్ట్ కానీ అద్బుతంగా మెప్పించాయి ట్రైలర్ లో, ఇటు శర్వానంద్ కానీ అటు సిద్దార్థ్ కానీ…

ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు తమ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ తో మెప్పించగా రావ్ రమేష్ విలనిజం అదిరిపోయింది… ఇక ట్రైలర్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ బ్యాగ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి, మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ఫీల్ ను మరో లెవల్ లో పెంచింది అని చెప్పాలి. రెగ్యులర్ కమర్షియల్ మూవీ లా కాకుండా ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ స్టొరీ పాయింట్ తో వస్తున్న…

మహా సముద్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అక్టోబర్ 14 న రిలీజ్ కాబోతుంది… సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా ట్రైలర్ కచ్చితంగా ఆ అంచనాలను మరింత పెంచేసింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో సినిమా ఇంప్రెస్ చేస్తే ఇటు శర్వానంద్ ని తిరుగు లేని కంబ్యాక్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే సిద్దార్థ్ కి తెలుగు లో సాలిడ్ రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here