Home న్యూస్ 13 ఏళ్ల క్రితం మూవీ….బాలయ్య మహారథి అప్పు ఇంకా కడుతున్న నిర్మాత!

13 ఏళ్ల క్రితం మూవీ….బాలయ్య మహారథి అప్పు ఇంకా కడుతున్న నిర్మాత!

1

సినిమా నిర్మాణం లో పాలు పంచుకున్న వాళ్ళకే సినిమా ను ఎంతలో నిర్మించాలి అన్న లెక్కలు ఎక్కువగా తెలిసి ఉంటాయి, సొంత డబ్బులతో కొందరు లేదా ఫైనాన్స్ తో కొందరు సినిమాలను నిర్మిస్తూ ఉంటారు… సొంత డబ్బులతూ రిస్క్ చేసే వాళ్ళు అయితే డబ్బులు పోగొట్టుకుంటారు లేదా సంపాదించుకుంటారు, ఫైనాన్స్ మీద సినిమాలు నిర్మించే వాళ్ళు డబ్బులు వస్తే వడ్డీలతో సహా ఫైనాన్స్ సెటిల్ చేయాలి, తర్వాత ఏమైనా మిగిలితే అప్పుడు ప్రాఫిట్స్ చూసుకుంటారు.

కానీ సినిమా ఫ్లాఫ్ అయితే ఫైనాన్స్ అప్పులు తీర్చలేక రోడ్డున పడ్డ వాళ్ళు అనేక మంది ఉన్నారు… ఇలాంటి పరిస్థితి కాకున్నా సినిమా నిర్మాణం గురించి పూర్తిగా తెలిసినా ఫైనాన్స్ తెచ్చుకునే పనులతో నిర్మాణం వైపు పూర్తిగా ఫోకస్ చేయలేక భారీ నష్టాలు చూసిన నిర్మాత ఉన్నాడు…

అతనే వాకాడ అప్పారావ్…. RB చౌదరి నిర్మించిన సినిమాలకు అన్నింటికీ దాదాపుగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన వాకాడ అప్పారావు…. ప్రతీ సినిమా విషయం లో డబ్బులు RB చౌదరి పెట్టినా అన్ని పనులను దగ్గరుండి చూసుకునే వారు. అలాంటి ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నిర్మాతగా మారి 2007 లో బాలయ్య తో మహారథి సినిమా…

చేయగా ఈ సినిమా తో అనేక అప్పులను చేయాల్సి వచ్చిందట. సొంత డబ్బు తో అయితే రిస్క్ ఉండేది కాదు కానీ ఫైనాన్స్ డబ్బులతో చేయడం అవి టైం కి అందక పోవడం తో నిర్మాణ పనులను చూసుకోలేక పోవడం డబ్బుల కోసమే తిరగడం తో సినిమా బడ్జెట్ పెరుగుతూ పోగా… ఫైనల్ గా బ్యాంక్ లోన్ ద్వారా మరో 4 కోట్లు తెచ్చి…

సినిమాను నిర్మించగా సినిమా రిలీజ్ అయ్యాక భారీ నష్టాలను సొంతం చేసుకోవడం తో అప్పటి నుండి ఈ సినిమా అప్పులను తీర్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఇప్పటికీ ఒక బిగ్ అమౌంట్ తీసుకున్న ఫైనాన్స్ కి ఇంకా చెల్లింపులు చేస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చారు ఈయన. సినిమా నిర్మాణం ఎంత కష్టమో చెప్పడానికి ఇదో ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here