Home న్యూస్ 2 నెలల్లో టాలీవుడ్ లో 1st క్లీన్ హిట్…..మనం ఎప్పుడు కొడతమో!!

2 నెలల్లో టాలీవుడ్ లో 1st క్లీన్ హిట్…..మనం ఎప్పుడు కొడతమో!!

0

టాలీవుడ్ కి ఈ ఇయర్ బాగానే స్టార్ట్ అయ్యింది, జనవరిలో భారీ ఎపిక్ బ్లాక్ బస్టర్ దక్కగా తర్వాత మార్చ్ ఎండ్ లో మరో బ్లాక్ బస్టర్ సొంతం అయ్యింది. ఇక సమ్మర్ లో టాప్ స్టార్స్ మూవీస్ తో సందడి మరో లెవల్ లో ఉంటుంది అనుకుంటే అన్ని సినిమాలు ఎలక్షన్స్ అండ్ IPL వలన పోస్ట్ పోన్ అవ్వడంతో చిన్నా చితకా సినిమాలు రిలీజ్ అయినా కూడా ఒక్కటి కూడా…

ఆడియన్స్ ను మెప్పించ లేక పోయింది…ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మేల్ బాయ్స్ సినిమా తెలుగులో డబ్ వర్షన్ తో హిట్ ని అందుకోగా తర్వాత టాలీవుడ్ లో రిలీజ్ అయిన స్ట్రైట్ అండ్ డబ్ మూవీస్ ఏవి కూడా హిట్ గీతని దాటలేదు…మధ్యలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరియు భజే వాయు వేగం లాంటి సినిమాలు…

Maharaja 4 Days Total WW Collections Report!!

బిజినెస్ ను రికవరీ చేసిన మైనర్ ప్రాఫిట్స్ ను దక్కించుకున్నాయి కానీ డీసెంట్ హిట్స్ గా అయితే నిలవలేదు…ఇప్పుడు శర్వానంద్ మనమే మూవీ ఇంకా కొంచం కష్టపడితే హిట్ అయ్యే అవకాశం ఉంది కానీ లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందో చెప్పలేం…ఈ టైంలో ఆడియన్స్ ముందుకు తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన…

విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా 3 రోజుల్లో బిజినెస్ ను 4 రోజుల్లో ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా రాగా 5వ రోజు కలెక్షన్స్ తో ఇప్పుడు తెలుగులో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకోగా మిగిలిన రన్ లో సినిమాకి డీసెంట్ లాభాలు ఇప్పుడు సొంతం అయ్యే అవకాశం ఉండగా, ఆల్ మోస్ట్ 2 నెలల్లో టాలీవుడ్ లో..

రిలీజ్ అయిన స్ట్రైట్ అండ్ డబ్బింగ్ మూవీస్ లో మహారాజ ఫస్ట్ క్లీన్ హిట్ మూవీగా నిలిచింది అని చెప్పాలి….కానీ అదే టైంలో టాలీవుడ్ మార్చ్ ఎండ్ నుండి ఇప్పటి వరకు చూసుకుంటే కొన్ని సినిమాలు బిజినెస్ ను రికవరీ చేసినా కూడా నికార్సయిన హిట్ అయితే సొంతం అయ్యి రెండున్నర నెలలకు పైనే అవుతుంది…మరి ఏ సినిమా తెలుగులో తిరిగి మంచి లాభాలను తెచ్చిపెట్టే రేంజ్ హిట్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here