Home న్యూస్ విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా ట్రైలర్ రివ్యూ…ఇదేం మాస్ రా బాబు!

విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా ట్రైలర్ రివ్యూ…ఇదేం మాస్ రా బాబు!

0

విలక్షణ రోల్స్ తో కోలివుడ్ తో పాటు తెలుగు అండ్ పాన్ ఇండియా రేంజ్ లో మంచి పేరును సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో అప్పుడే 49 సినిమాలు పూర్తి అవ్వగా ఇప్పుడు తన కెరీర్ లో 50వ సినిమాగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ మహారాజ(Maharaja Movie) ఆడియన్స్ ముందుకు ఈ నెల 14న రిలీజ్ కాబోతుంది…

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విజయ్ సేతుపతి సినిమాలకు డీసెంట్ క్రేజ్ ఉండగా ఈ సినిమాను ఇప్పుడు అదే టైంకి తెలుగు లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. కాగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ చూస్తుంటే విజయ్ సేతుపతి కెరీర్ లో మరో మంచి సినిమాగా మారే అవకాశం ఉందనిపిస్తుంది…

కథ పాయింట్ ను కూడా కొద్ది వరకు రివీల్ చేయగా హీరో ఇంట్లో లక్ష్మీ పోయింది అంటూ పోలిస్ స్టేషన్ లో కేసు వేయడానికి దెబ్బతో వస్తారు..కానీ తను చెబుతున్న మాటలు పోలీసులకు అర్ధం కావు…దాంతో కేసు కోసం హీరో ట్రై చేస్తూ ఉంటాడు…ఈ క్రమంలో తర్వాత ఏం జరిగింది అన్నది అసలు సిసలు కథ అని చెప్పొచ్చు…

ట్రైలర్ ఎండ్ లో అనురగ్ కశ్యప్ ఇద్దరినీ బెదిరిస్తూ వెనక్కి తిరిగి చూపించగా అతనే విలన్ గా చేస్తున్నాడని తెలుస్తూ ఉందా హీరో విలన్ మీద రివేంజ్ డ్రామా గా అనిపిస్తున్న మహారాజ ట్రైలర్ వరకు కథ రొటీన్ గానే ఉన్నప్పటికీ డిఫెరెంట్ గా చెబుతూ విజయ్ సేతుపతి ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ తో రచ్చ లేపలా అనిపిస్తూ ఉండగా…

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ మెప్పించినట్లే సినిమా కూడా మెప్పిస్తే మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. తెలుగులో ఆ టైంలో పోటి ఉండబోతున్నా డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here