T2B Live

Box office India - Tollywood - Bollywood - Box Office Reports

మహర్షి ఫస్ట్ డే కలెక్షన్స్…ఆ ఏరియా దెబ్బ కొట్టింది!!



  సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా ముందుగా ఓవర్సీస్ లో పడుతూ లేస్తూ ఎలాగోలా 0.5 మిలియన్ మార్క్ ని అందుకోగా మిగిలిన చోట్లా మాత్రం కుమ్మేసింది, కర్ణాటక మరియు సీడెడ్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కొంచం వీక్ గా ఉన్న ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మహర్షి దుమ్ము లేపింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందా లేదా అన్నది తేలనుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే రెండు రాష్ట్రాలలో అవలీలగా 22 కోట్ల నుండి 23 కోట్ల రేంజ్ లో షేర్ పక్కా అని చెప్పాలి.

ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 30 కోట్ల రేంజ్ కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఓవర్సీస్ లో మహేష్ ఇతర సినిమా ల రేంజ్ లో మహర్షి పెర్ఫార్మ్ చేసి ఉంటే 1 మిలియన్ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చేవి, ఫస్ట్ డే మరిన్ని రికార్డులు కొట్టేది, ఆ ఏరియా దెబ్బ కొట్టిన మహేష్ స్టార్ డం తో తొలిరోజు దుమ్ము లేపే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నాడు అని చెప్పొచ్చు. ఇక అఫీషియల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Related Articles

Post A Comment

avatar

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE