మహర్షి డే 1 ఓపెనింగ్స్…సూపర్ స్టార్ ఊచకోత!

0
1017

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర నేడు భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది, సినిమా పై నెలకొన్న అంచనాల దృశ్యా బాక్స్ ఆఫీస్ దగ్గర 1900 నుండి 2000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన మహర్షి ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో 0.5 మిలియన్ ని వసూల్ చేయగా రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం రికార్డ్ లెవల్ లో ఓపెన్ అయ్యింది, ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి…

ఓవరాల్ గా ఆక్యుపెన్సీ మార్నింగ్ షో సమయానికి ఏకంగా 80% వరకు ఉందని అంచనా, ఇది రోజు ముందు కేవలం 60% లోపే ఉండేది, ఈ రేంజ్ లో ఇంప్రూవ్ మెంట్ ని సొంతం చేసుకుని ఊచకోత కోస్తున్న సూపర్ స్టార్ ఈవినింగ్ అండ్ నైట్ షోల వరకు ఇదే రేంజ్ లో రెచ్చిపోతే…

రెండు తెలుగు రాష్ట్రాలలో 22 కోట్ల రేంజ్ లో వసూళ్లు పక్కా అని చెప్పాలి, ఇది కేవలం ఆన్ లైన్ టికెట్ సేల్స్ అలాగే ఆఫ్ లైన్ అదే రేంజ్ లో టికెట్ సేల్స్ ఉంటే జరుగుతుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ రేంజ్ ని బట్టి ఈ లెక్క మరింత పెరగడమా లేక తగ్గడమా అనేది తేలనుంది. మరి రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here