Home న్యూస్ అటు ఖైదీ150-అరవింద సమేత…ఇటు రంగస్థలం ఔట్..

అటు ఖైదీ150-అరవింద సమేత…ఇటు రంగస్థలం ఔట్..

886
0

  సూపర్ స్టార్ మహర్షి బాక్స్ ఆఫీస్ రాంపేజ్ కొనసాగుతుంది, సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుండగా ఒక్కో ఏరియా లో ఒక్కో సినిమా రికార్డ్ ను, కొన్ని సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ రికార్డులను కూడా సినిమా బ్రేక్ చేస్తూ దూసుకు పోతుంది, ఈ క్రమం లో సినిమా ముందుగా నైజాం ఏరియాలో రంగస్థలం పేరిట ఉన్న ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది.

ట్రేడ్ లెక్కల్లో 27.8 కోట్లు, నిర్మాతల లెక్కల్లో ఓవర్ ఫ్లో కలెక్షన్స్ తో 28.9 కోట్లు నైజాం లో వసూల్ చేసిన రంగస్థలం ఆల్ టైం రికార్డ్ ను మహర్షి 3 వారాల కలెక్షన్స్ తో బ్రేక్ చేసి 29 కోట్ల షేర్ ని ఇక్కడ అందుకుని ఆల్ టైం హిస్టారికల్ ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది.

ఇక ఖైదీ నంబర్ 150 లైఫ్ టైం గ్రాస్ 164 కోట్లు, అరవింద సమేత లైఫ్ టైం గ్రాస్ 165 కోట్ల ని బ్రేక్ చేసిన మహర్షి ట్రేడ్ లెక్కల్లో 167 కోట్ల దాకా వసూల్ చేయగా నిర్మాతల లెక్కల్లో 175 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది, దాంతో ట్రేడ్ లెక్కల్లో భరత్ అనే నేను 171 కోట్ల గ్రాస్ ని కూడా క్రాస్ అయినట్లే లెక్క. మొత్తం మీద మహర్షి కెరీర్ బెస్ట్ రికార్డులతో పాటు ఇతర సినిమాల రికార్డులు మరికొన్ని ఇండస్ట్రీ రికార్డులు కూడా నమోదు చేసి సంచలనం సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!