కర్ణాటకలో ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్ సాధించిన మహర్షి!

0
610

  సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఇక్కడి తో పాటు పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే, కాగా లేటెస్ట్ మూవీ మహర్షి అక్కడ కూడా భారీ ఎత్తునే రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు అక్కడ సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అని అంతా భావించారు. కానీ సినిమా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకున్నా అవి మహేష్ కెరీర్ బెస్ట్ ని అందుకోలేక పోయాయు.

మొత్తం మీద మొదటి రోజు కర్ణాటక లో మహర్షి సినిమా 3.34 కోట్ల షేర్ ని 6 కోట్లకి అటూ ఇటూ గా గ్రాస్ ని వసూల్ చేసిందని అంచనా. ఇది మహేష్ లాస్ట్ మూవీ భరత్ అనే నేను కన్నా తక్కువ. ఆ సినిమా మొదటి రోజు అక్కడ 6.24 కోట్ల గ్రాస్ ని 3.73 కోట్ల షేర్ ని అందుకుంది.

కాగా కర్ణాటక లో స్ట్రైట్ మూవీస్ ని నుండి ఎలాంటి పోటి లేకపోవడం ఒక్క అవెంజర్స్ మాత్రమె పోటి ఇచ్చేలా ఉన్నా కానీ మహేష్ మూవీ కి దుమ్ము లేపే కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా ఓవరాల్ గా మాత్రం జస్ట్ ఓకే అనిపించే కలెక్షన్స్ నే అందుకుంది ఈ సినిమా. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి వసూళ్ళ ని అక్కడ అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!