ఎన్టీఆర్ 3 ఏళ్ల ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్…నైజాం గడ్డపై మహేష్ వీరంగం!

2
637

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాధించిన బిగ్గెస్ట్ రికార్డ్ నైజాం ఏరియాలో మొదటి రోజు ఊహకందని లెవల్ లో సాధించిన ఊచకోత, 2016 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెలకొల్పిన రికార్డ్ ను మరే స్టార్ హీరో కూడా అందుకోలేదు, జనతా గ్యారేజ్ 5.51 కోట్ల షేర్ తో తొలిరోజు రికార్డ్ కొట్టగా మళ్ళీ ఎన్టీఆర్ 2018 లో అరవింద సమేత తో ఇక్కడ…

5.73 కోట్ల షేర్ తో మరోసారి తన రికార్డ్ ను తానె కొట్టాడు, కాగా ఇప్పుడు ఎట్టకేలకు ఎన్టీఆర్ నైజాం డే 1 రికార్డ్ ను మహేష్ బాబు బ్రేక్ చేశాడు, తొలిరోజు నైజాం ఏరియాలో మహర్షి సినిమా ఏకంగా 6.38 కోట్ల షేర్ ని అందుకుని ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ ను నమోదు చేసింది.

దాంతో ఎన్టీఆర్ పేరిట మూడేళ్ళు గా కొనసాగుతున్న రికార్డ్ ఇప్పుడు బ్రేక్ అయినట్లయింది. మొత్తం మీద మిగిలిన ఏరియాల కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉండగా సినిమా ఊహకందని లెవల్ లో మహేష్ కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేయడం మాత్రం పక్కా అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here