Home న్యూస్ మహర్షి రివ్యూ…రేటింగ్…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

మహర్షి రివ్యూ…రేటింగ్…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

1387
1

          సూపర్ స్టార్ మహేష్ బాబు సెన్సేషనల్ 25 వ సినిమా మహర్షి ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కి ముగ్గురు నిర్మాతలు అవ్వడం తో క్రేజ్ మరింతగా పెరిగింది, ముందుగా ఓవర్సీస్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా కి ఫైనల్ గా ఆడియన్స్ టాక్ ఎలా ఉందో, ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి…

స్టొరీ పాయింట్: మిడిల్ క్లాస్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయిన మహేష్ కి లైఫ్ లో చాలా పెద్ద గోల్స్ ఉంటాయి, అవి అందుకుంటాడు కూడా… కానీ ఉన్నత శిఖరాలను అందుకున్న తర్వాత అనుకోకుండా తన స్నేహితుడు అల్లరి నరేష్ కోసం ఒక ఊరికి వస్తాడు. అలా ఎందుకు వచ్చాడు కారణం ఏంటి, వచ్చి ఎం చేశాడు అన్నది ఓవరాల్ గా స్టొరీ పాయింట్.

పెర్ఫార్మెన్స్: మహేష్ నుండి పోకిరి, బిజినెస్ మాన్ తరహా ఇంటెన్స్ యాక్టింగ్ ఉన్న రోల్స్ కోరుకుంటున్నారు ఫ్యాన్స్, కానీ మహేష్ కి అలాంటి కథలు దొరకక సటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కథ లో దొరుకుతున్నాయి. ఇది కూడా అలాంటి కథనే అయినా కొంచం రిలీఫ్ గా కాలేజ్ స్టూడెంట్ రోల్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంటుంది అని చెప్పాలి.

ఆ సీన్స్ లో పాత వింటేజ్ మహేష్ కనిపిస్తాడు, ఇక తర్వాత మళ్ళీ CEO గా సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించాగా తర్వాత ఫార్మర్ గా ఆకట్టుకుంటాడు. ఓవరాల్ గా కాలేజ్ స్టూడెంట్ రోల్ ఎక్కువగా నచ్చే చాన్స్ ఉంది, ఇక అల్లరి నరేష్ రోల్ ముందు నవ్వించి తర్వాత ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది, నరేష్ పాత్ర ని పైడిపల్లి బాగా రాసుకున్నాడు.

ఇక పూజ హెడ్గే రోల్ కూడా ఓకే అనిపించే విధంగా ఉంది. మిగిలిన పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ ఓకే అనిపించగా జగపతిబాబు విలనీ ఆకట్టుకున్నా పవర్ ఫుల్ గా అయితే లేదు. మహేష్ జగపతిబాబు ల సీన్స్ బాగున్నాయి. ఫైట్ సీన్స్ అయితే రచ్చ రచ్చ చేసేలా ఉన్నాయని చెప్పొచ్చు.

సంగీతం & సాంకేతిక వర్గం: దేవి సంగీతం వీక్ గా ఉంది, పాటలు చూడటానికి బాగున్నా పెద్దగా రిజిస్టర్ అయితే కావు, కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో మాత్రం దుమ్ము లేపాడు, ఫైట్ సీన్స్ కి అయితే ఓ రేంజ్ లో కుమ్మేశాడు దేవి, ఇక ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లెంత్ చాలా ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది, ఫస్టాఫ్ లో ఓ 15 నిమిషాలు, సెకెండ్ ఆఫ్ లో ఓ 20 నిమిషాలు కథ చాలా స్లో అవుతుంది, డైరెక్షన్ పరంగా వంశీ ఫెయిల్ అయ్యింది ఇక్కడే, 2 ఏళ్ళకి పైగా టైం తీసుకున్నా పకడ్బందీ స్క్రీన్ ప్లే రాసుకోలేక పోయాడు వంశీ పైడిపల్లి.

ఒక ఓవరాల్ గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ని గమనిస్తే
ప్లస్ పాయింట్స్:- *మహేష్ కాలేజ్ స్టూడెంట్ రోల్
*కాలేజ్ లవ్, కామెడీ, ఫ్రెండ్ షిప్ ఎపిసోడ్స్
*ఎమోషనల్ ఇంటర్వెల్*
*దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్
*ఫైట్ సీన్స్ & ప్రెస్ మీట్ సీన్
*ఎమోషనల్ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:-
* మూవీ లెంత్
*ఫస్టాఫ్ లో ఓ 15 నిమిషాలు, సెకెండ్ ఆఫ్ లో ఓ 20 నిమిషాల స్లో సీన్స్
*సాంగ్స్
*ఎడిటింగ్
ఇవీ మొత్తం మీద సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్….

సినిమా ఓవరాల్ గా మహేష్ వన్ మ్యాన్ షో గా చెప్పుకోవాలి, సినిమా వ్యవసాయంలో ఉండే కష్టాలు వ్యవసాయ దారులు ఎదురుకునే కష్టాల గురించి హార్ట్ టచింగ్ గా చెప్పి మెప్పించారు, సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా ఓవరాల్ గా ప్రేక్షకుల మనసు గెలుచుకునే సినిమా…

సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్… మహేష్ ఫ్యాన్స్ కి ఎలాగూ విందు భోజనమే, ఇక కామన్ ఆడియన్స్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంటుంది, న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here