నైజాం లో చరిత్ర సృష్టించిన సూపర్ స్టార్…ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్

0
492

  సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళ తో దూసుకు పోతుండగా అన్ని ఏరియాలు ఒకెత్తు సినిమా నైజాం ఏరియాలో సాధిస్తున్న ఊహకందని కలెక్షన్స్ లెక్కలు మరో ఎత్తుగా చెప్పుకోవాలి, నైజాం మాస్ సెంటర్స్ లో ఒకటి అయినప్పటికీ మహేష్ మహర్షి కి ఊహకందని లెవల్ లో కలెక్షన్స్ ఊచకోత కోస్తూ 6 రోజుల్లో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది.

నైజాం ఏరియాలో అత్యంత వేగంగా 20 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ మూవీ గా నిలిచింది మహర్షి సినిమా, ఇది వరకు ఇక్కడ మొదటి వారం లో దువ్వాడ జగన్నాథం సినిమా ఆల్ మోస్ట్ 18 కోట్ల లోపు షేర్ ని అందుకోగా…

ఆ రికార్డ్ ని 5 రోజులకే బ్రేక్ చేసిన మహర్షి ఇప్పుడు 6 రోజుల్లోనే ఇక్కడ 20 కోట్లకు పైగా షేర్ ని అందుకుని చరిత్రకేక్కే రికార్డ్ కొట్టింది, ఇక మొదటి వారం పూర్తి అయ్యే సరికి 21.5 కోట్ల లోపు షేర్ ని అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఫైనల్ రన్ లో 30 కోట్లు కొట్టే చాన్స్ కూడా ఉందని చెబుతుండటం విశేషం…

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!