Home న్యూస్ ఫస్ట్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన మహర్షి!

ఫస్ట్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన మహర్షి!

1353
0

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపింది, సినిమా అద్బుతమైన ఓపెనింగ్స్ తో అన్ని ఏరియాల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి ఇండస్ట్రీ రికార్డ్ ను సొంతం చేసుకుంది, సినిమా గుంటూరు ఏరియా కి గాను ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.

అక్కడ మొదటి రోజు నాన్ బాహుబలి రికార్డ్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విదేయ రామ సినిమా 4.17 కోట్ల షేర్ తో సంచలన రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన మహర్షి సినిమా మొదటి రోజు గుంటూరు ఏరియాలో…

ఏకంగా 4.41 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది, ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి, రెండు సినిమాలకు ఈ ఏరియాలో మొదటి రోజు హైర్స్ సుమారు 1.45 కోట్లు యాడ్ అయ్యాయి. ఇక మిగిలిన ఏరియాలలో మహర్షి మొదటి రోజు కలెక్షన్స్ భీభత్సం ఎ రేంజ్ లో ఉంటుంది అన్నది ఆసక్తి గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here