Home న్యూస్ అరుపులే…మహర్షి టీసర్ రివ్యూ! బ్లాక్ బస్టర్ పక్కా!!

అరుపులే…మహర్షి టీసర్ రివ్యూ! బ్లాక్ బస్టర్ పక్కా!!

362
0

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి అఫీషియల్ టీసర్ ఎట్టకేలకు వచ్చేసింది, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా టీసర్ ప్రేక్షకుల మనసు గెలుచుకుందా అంటే అవుననే చెప్పాలి, టీసర్ లో మహేష్ తో చెప్పించిన డైలాగ్స్ మరీ పంచ్ లు కాకున్నా ‘సక్సెస్ లో ఫులిస్టాప్స్ ఉండవ్, కామాలు మాతమే” అంటూ ఒక డైలాగ్… అలాగే మరో డైలాగ్ కూడా ఆకట్టుకుంది…

‘నాకో ప్రాబ్లమ్ ఉంది సర్, ఎవరైనా నువ్ ఒడిపోతావ్ అంటే, గెలిచి చూపించడం నాకు అలవాటు’ ఈ రెండు డైలాగ్స్ టీసర్ లో ఆకట్టుకోగా, విజులవ్స్, మహేష్ ట్రేడ్ మార్క్ రన్నింగ్ స్టైల్ మరింత ఆకట్టుకున్నాయి, ఇక మొదటి పాట తో ఫుల్ మార్కులు దక్కించుకోని,

దేవి శ్రీ ప్రసాద్ మాత్రం టీసర్ తో మాత్రం దుమ్ము లేపాడు అని చెప్పాలి, ఓపెనింగ్ షాట్ నుండి ఎండింగ్ షాట్ వరకు దేవి మార్క్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో టీసర్ దుమ్ము లేపింది, ఇక విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉండగా ఫైట్స్ కి సినిమాలో బాగానే ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పాలి.

ఇవీ ఓవరాల్ గా ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మహేష్ ని ఇన్నాళ్ళు క్లీన్ షేవ్ లో చూసి సడెన్ గా గడ్డం మీసం లో చూడటం తో లుక్ కొద్దిగా మిస్ ఫెయిర్ అయ్యిందేమో అన్న ఫీలింగ్ కలిగింది, అది టీసర్ ఎండింగ్ కి సెట్ అయ్యింది. ఇక టీసర్ ఓవరాల్ గా చూస్తె…

శ్రీమంతుడు సినిమా మరో వర్షన్ ఆ అనిపించే విధంగా ఉండటం మరో చిన్న మైనస్ పాయింట్… ఓవరాల్ గా టీసర్ ప్రేక్షకుల ఫ్యాన్స్ ల మనసు గెలుచుకుందని చెప్పాలి, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో కుమ్ముతుందో తెలియాలి అంటే మే 9 వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here