Home న్యూస్ డిసాస్టర్ మూవీ…13 ఛానెల్స్…500M**…ఇదేమి రాంపేజ్ సామి!!

డిసాస్టర్ మూవీ…13 ఛానెల్స్…500M**…ఇదేమి రాంపేజ్ సామి!!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అత్యంత భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలను పూర్తిగా తప్పిన సినిమా ఆగడు, తనకి దూకుడు లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీనువైట్ల డైరెక్షన్ లో వెంటనే కమిట్ అయిన సినిమా ఆగడు. ఫస్టాఫ్ అద్బుతంగా ఉండి సెకెండ్ ఆఫ్ మళ్ళీ దూకుడు ఫ్లేవర్ నే వాడటంతో అది అనుకున్న రేంజ్ లో పండక పోవడం తో సినిమా…

అంచనాలను పూర్తిగా తప్పి టాలీవుడ్ లో ఆ టైం కి వన్ ఆఫ్ బిగ్గెస్ట్ లాస్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. అలాంటి సినిమా యూట్యూబ్ లో హిందీ డబ్ వర్షన్ సాలిడ్ విక్టరీని సొంతం చేసుకుంది, సినిమా ఒకటి కాదు రెండు కాదు…

ఏకంగా 13 ఛానెల్స్ లో హిందీ డబ్ వర్షన్ ని అప్ లోడ్ చేశారు… కాగా అన్ని ఛానెల్స్ లో కూడా సినిమా కి సాలిడ్ గా వ్యూస్ రాగా ఏవి కూడా డిలేట్ అవ్వడం మళ్ళీ రీ అప్లోడ్ అవ్వడం లాంటివి జరగలేదు, అలా కాకుండానే ఓవరాల్ గా అన్ని ఛానెల్స్ లో కలిపి…

ఆగడు హిందీ డబ్బింగ్ వర్షన్ కి ఏకంగా 500 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది ఆగడు సినిమా. ఈ రేంజ్ లో అన్ని ఛానెల్స్ లో వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. కానీ ఎక్కువ శాతం సింగిల్ ఛానెల్ లో హైయెస్ట్ వ్యూస్ ఎక్కువ ఏ సినిమా కి దక్కాయి అన్నది కౌంట్ చేస్తారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్ టు బాక్ 3 హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉండగా ప్రస్తుతం పరశురాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమా ను మొదలు పెట్టె పనిలో ఉన్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here