Home న్యూస్ గంటలో ఇన్ని ట్వీట్స్ ఏంటి సామి…మెంటల్ మాస్ ఇది!!

గంటలో ఇన్ని ట్వీట్స్ ఏంటి సామి…మెంటల్ మాస్ ఇది!!

1249
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా లో సూపర్ స్టార్ పుట్టిన రోజు కానుకగా బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను నమోదు చేస్తూ దూసుకు పోతున్నారు. పాత రికార్డుల బెండు తీస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతున్న ఈ ట్రెండ్ లో మొదటి 1 మిలియన్ ట్వీట్స్ కోసం కేవలం 9 నిమిషాలకు పైగానే టైం తీసుకుని దుమ్ము దుమారం చేశారు. ఇక 15 నిమిషాల్లో 1.43 మిలియన్ ట్వీట్స్ వేశారు.

ఇక మొదటి గంటలో ఇది వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 4.13 మిలియన్ ట్వీట్స్ తో సంచలనం సృష్టించగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడమే కాకుండా వరల్డ్ రికార్డ్ కూడా నెలకొల్పారు. ఇది వరకు వరల్డ్ రికార్డ్ గంటలో…

5 మిలియన్స్ కి అటూ ఇటూగా ఉండగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ ఏకంగా 5.58 మిలియన్ ట్వీట్స్ ని పోల్ చేసి సంచలన రికార్డ్ ను నమోదు చేశారు. వీళ్ళ జోరు చూస్తుంటే ఇప్పుడు 24 గంటలు పూర్తి అయ్యే సరికి టాలీవుడ్ తరపునే కాకుండా కుదిరితే వరల్డ్ రికార్డ్ కూడా నమోదు చేసేలా ఉన్నారు.

ఇక సర్కారు వారి పాట హాష్ టాగ్ పై ఏకంగా 9 మిలియన్స్ కి పైగా ట్వీట్స్ ఇప్పటి వరకు పోల్ అవ్వగా 24 గంటల్లో ఆ టాగ్ పై కూడా కొత్త రికార్డులు నమోదు అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఇప్పటి వరకు 11.5 మిలియన్స్ కి పైగా ట్వీట్స్ బర్త్ దే ట్రెండ్ లో పోల్ అవ్వగా బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు ఫ్యాన్స్.

ఇది వరకు ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ లో 21.5 మిలియన్ ట్వీట్స్ పోల్ అవ్వగా మరి కొన్ని గంటల్లో ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు ఫ్యాన్స్. మొత్తం మీద ఇండియా లోనే బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ రికార్డ్ ను నమోదు చేయడానికి దూసుకు పోతున్న మహేష్ ఫ్యాన్స్ ఫైనల్ కౌంట్ ఏ రేంజ్ లో పెడతారో చూడాలి మరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here