వడ్డీ తో సహా కలిపి కట్టేసిన మహేష్…అందరు షాక్!

0
421

     రీసెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పై టోటల్ ఇండస్ట్రీ లో ఎక్కువ మంది అలాగే మీడియా చానెల్స్ అండ్ సోషల్ మీడియా ఎదురు తిరిగిన విషయం తెలిసిందే, హైదరాబాదు లోని AMB సినిమాను కొత్తగా మొదలు పెట్టిన మహేష్ బాబు, థియేటర్ పనులను వేరే వాళ్ళకి అప్పగించగా రీసెంట్ గా GST లో జరిగిన మార్పుల తర్వాత అన్ని థియేటర్స్ లో టికెట్ రేట్లని సవరించి… 28% పెంచిన రేట్ల నుండి…

18% కి తగ్గించి టికెట్ రేట్లు అమలు చేయాలనీ నిర్ణయం తీసుకోగా అన్ని థియేటర్స్ అమలు పరిచినా AMB థియేటర్స్ లో మాత్రం 28% ఉంచడం తో ఓవరాల్ గా టాక్స్ కలిపి 35 లక్షల దాకా చెల్లించాల్సి ఉందని అధికారులు మహేష్ బాబు కి నోటిసులు పంపారు.

దాంతో ఒక్కసారిగా అందరికి అందరు మహేష్ టాక్సులు ఎగ్గోట్టాడు అంటూ స్పెషల్ ప్రోగ్రామ్స్ తో మీద పడగా, వెంటనే గమనించిన మహేష్ అప్పటి కప్పుడు కట్టాల్సిన టాక్సులు అన్నీ వడ్డీ తో సహా కలిపి మొత్తం చెల్లించారట. కాగా అధికారులు వెంటనే స్పందించి… ఇలా నోటిసులు పంపిన వెంటనే…

ఇంత ఫాస్ట్ గా స్పందించి డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారని, మహేష్ స్పందించి వెంటనే టాక్సులు కట్టడం ఒక భాద్యత గల పౌరుడి కి ఉన్న లక్షణం చూపెట్టింది అంటూ మెచ్చుకున్నారట. దాంతో టాలీవుడ్ కూడా మహేష్ స్పందించిన తీరు చూసి…

షాక్ అయినా తర్వాత మెచ్చుకుంటున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అవుతున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా తో మహేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు అందుకుంటాడో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!