టాలీవుడ్ లో కొత్త సినిమాల రేంజ్ లో జోరు రెండు మూడేళ్ళుగా రీ రిలీజ్ ల సినిమాలకు కూడా జరుగుతూ ఉండగా…..మిగిలిన స్టార్స్ నటించిన సినిమాలు ఒకెత్తు అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన సినిమాల రీ రిలీజ్ ల జోరు మరో ఎత్తుగా చెప్పాలి. రీ రిలీజ్ ల ట్రెండ్ స్లో డౌన్ అయినా కూడా..
మహేష్ బాబు ఏ సినిమా రీ రిలీజ్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా అనుకున్న రేంజ్ లో జోరు చూపించదు అని అనిపించినా ఆ సినిమా కూడా ఆశ్యర్య పరుస్తూ ప్రతీ సారి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం విశేషం…
లాస్ట్ ఇయర్ మురారి సినిమా అల్ట్రా క్లాస్ మూవీ అవ్వడంతో పెద్దగా ఇంపాక్ట్ చూపించదు అనుకున్నా కూడా ఆ సినిమా సంచలన కలెక్షన్స్ ని అందుకోగా…ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu Movie) లాంటి క్లాస్ మూవీ…
12 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ ను మార్చ్ లాంటి అన్ సీజన్ లో సొంతం చేసుకున్నా కూడా మొదటి రోజు అఫీషియల్ లెక్కలు అంచనాలను మించి పోయాయి… ఏకంగా 2.9 కోట్ల రేంజ్ దాకా ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని ఊహకందని రాంపెజ్ ను చూపించడం విశేషం…
ఒకసారి మహేష్ బాబు నటించిన సినిమాలు రీ రిలీజ్ లో మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సాధించాయో గమనిస్తే…
Mahesh Babu Movies Re Release Day 1 Collections
👉#SVSC Re Release – 2.90CR****
👉#Murari4K – 5.41Cr~
👉#BusinessMan4K – 5.27Cr
👉#Okkadu – 2.05CR~
👉#Pokiri – 1.73Cr
ఆల్ మోస్ట్ అన్ని సినిమాలు రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను రీ రిలీజ్ లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా…5 సినిమాల టోటల్ ఓపెనింగ్స్ మొత్తం మీద 17.36 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోగా యావరేజ్ గా ఒక్కో సినిమా కి 3.47 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంటూ…
మిగిలిన స్టార్స్ తో పోల్చితే రీ రిలీజ్ లో కూడా సెన్సేషనల్ ట్రాక్ రికార్డ్ ను నమోదు చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇక రీ రిలీజ్ లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకుంటుందో చూడాలి.