Home న్యూస్ 250 కోట్ల సినిమా…. అక్కడ బాగున్నా చూడలేదు…ఇప్పుడు ఏం సినిమా రా అంటున్నారు!

250 కోట్ల సినిమా…. అక్కడ బాగున్నా చూడలేదు…ఇప్పుడు ఏం సినిమా రా అంటున్నారు!

0

కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయవు కానీ తర్వాత డిజిటల్ లోనో లేక టెలివిజన్ లోనో రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి…ఈ ఇయర్ బాలీవుడ్ లో రిలీజ్ అయిన మూవీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రివ్యూలను సొంతం చేసుకున్న సినిమాల్లో…

అజయ్ దేవగన్(Ajay Devgn) నటించిన మైదాన్(Maidaan Movie ) సినిమా ఒకటి అని చెప్పాలి…రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా ఆల్ మోస్ట్ 9 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడంతో ఆడియన్స్ లో ఆసక్తి తగ్గిపోయి ఈ ఇయర్ రంజాన్ కి రిలీజ్ అయ్యి అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా…

జనాలు ఏమాత్రం ఆదరించలేదు….ఆల్ మోస్ట్ 250 కోట్ల మమ్మోత్ బడ్జెట్ తో నిర్మాణం అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ రివ్యూలతో కూడా ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. అలాంటి సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ అయింది.

అమెజాన్ ప్రైమ్ లో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగా ఇక్కడ మాత్రం సినిమా మరో లెవల్ లో రెస్పాన్స్ వస్తుంది. కొంచం స్లో గా సినిమా స్టార్ట్ అయినా కూడా అసలు కథలోకి వెళ్ళిన తర్వాత నుండి ఆ తర్వాత సీన్ ఏమవుతుందా అన్న ఆసక్తితో సాగే సినిమా చివరి 30 నిముషాలు మాత్రం చాలా బాగా డైరెక్టర్ తీయడంతో…

సినిమా అయ్యే టైంకి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది అంటూ చెబుతున్నారు ఆడియన్స్ ఇప్పుడు. బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ ఎంత బాగున్నా చూడలేదు కానీ ఇప్పుడు మాత్రం సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఏం సినిమారా బాబు…మాస్ట్ వాట్చ్ మూవీస్ లో ఈ సినిమా ఒకటి అంటూ చెబుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించలేక పోయిన ఈ సినిమా ఇక డిజిటల్ లో మాత్రం రచ్చ చేస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here