Home న్యూస్ 9 సార్లు పోస్ట్ పోన్ అయిన మైదాన్ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

9 సార్లు పోస్ట్ పోన్ అయిన మైదాన్ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

0

కొన్ని సినిమాలు రిలీజ్ టైంలో ఏవో ఇబ్బందుల కారణంగా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి…అలాంటి సినిమాలు ఆడియన్స్ ముందుకు చాలా లేట్ గా వచ్చిన తర్వాత అంచనాలను అందుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది, బాలీవుడ్ లో ఇలానే అనేక సార్లు పోస్ట్ అయిన సినిమా ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయింది…

అజయ్ దేవగన్(Ajay Devgn) నటించిన మైదాన్(Maidaan Movie Telugu Review) సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఎప్పటి కప్పుడు పోస్ట్ పోన్ అవుతూ ఆల్ మోస్ట్ 9 సార్లు రిలీజ్ ను కాన్సిల్ చేసుకుని ఎట్టకేలకు ఇప్పుడు రంజాన్ కానుకగా రిలీజ్ అయింది. మరి సినిమా లేట్ అయిన ఆడియన్స్ అంచనాలను అందుకుందా లేదా అంటే మాత్రం..

చాలా వరకు అంచనాలను అందుకంది అనే చెప్పాలి. కథ పాయింట్ 1952 టైంలో ఒలింపిక్స్ లో ఓడిపోయిన ఇండియా మీద కోచ్ అయిన హీరో మీద వేటు వేస్తారు…కానీ హీరో ఆ తర్వాత ఏం చేశాడు…ఇండియన్ ఫుట్ బాల్ టీం ను బలోపేతం చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అన్నది మొత్తం మీద సినిమా స్టోరీ పాయింట్…

సినిమా చూస్తున్న టైంలో కొంచం షారుఖ్(shah rukh Khan) చెక్ దే ఇండియా సినిమా గుర్తుకు వస్తుంది కానీ ఇక్కడ మైదాన్ లో కూడా గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ కి కొదవ లేదు, కానీ టేక్ ఆఫ్ కి కొంచం ఎక్కువ టైం తీసుకున్న సినిమా వన్స్ అసలు కథ మొదలు అయిన తర్వాత ఆసక్తి కరమైన సీన్స్ తో మెప్పించింది…

సెకెండ్ ఆఫ్ లో ఎక్కువ శాతం హైలెట్ సీన్స్ ఉండగా పాటలు యావరేజ్ గా ఉండటం సినిమాకి మేజర్ మైనస్ పాయింట్, అలాగే హీరో తప్ప మిగిలిన ఫుట్ బాల్ ప్లేయర్స్ లో ఎవ్వరూ పెద్దగా హైలెట్ అవ్వలేక పోవడం మరో మైనస్ పాయింట్…లెంత్ కూడా మరీ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగినా కూడా ఓవరాల్ గా సినిమా పూర్తి అయ్యే టైంకి మాత్రం…

ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి రావడం మాత్రం ఖాయమని చెప్పాలి. కొంచం లెంత్ ని తగ్గించి ఉంటే మాత్రం ఇంకా టైట్ స్క్రీన్ ప్లే తో సినిమా ఇంకా బాగా మెప్పించి ఉండేది… ఓవరాల్ గా చాలా సార్లు పోస్ట్ పోన్ అవ్వడంతో పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి మైదాన్ మూవీ చాలా వరకు సర్పైజ్ చేస్తూ మెప్పించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here