Home న్యూస్ అమ్మింది 21.14 కోట్లు…2 వీక్స్ లో వచ్చింది ఇది!

అమ్మింది 21.14 కోట్లు…2 వీక్స్ లో వచ్చింది ఇది!

338
0

  అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారలను ఘనంగా పూర్తి చేసుకుంది, కాగా సినిమా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ గీత ని దాటగా రెండో వారం లో హిట్ నుండి బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది మజిలీ. సినిమా 14 వ రోజు టోటల్ గా 30 లక్షల షేర్ ని రెండు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 36 లక్షల షేర్ ని అందుకుంది.

దాంతో రెండు వారాల్లో టోటల్ గా రెండు రాష్ట్రాలలో మజిలీ సినిమా 27.25 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా రెండు వారాల్లో 34.93 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించింది. దాంతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 57.5 కోట్ల మార్క్ ని అందుకుంది.

మొత్తం మీద సినిమాను 21.14 కోట్లకు అమ్మగా సినిమా 22 కోట్ల రేంజ్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగగా సినిమా ఇప్పటికే 13 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మూడో వారంలో మినిమం హోల్డ్ చేసినా 38 కోట్ల రేంజ్ వసూళ్ళతో ముగించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here