Home న్యూస్ అరాచకం…మజిలీ డే 7 కలెక్షన్స్

అరాచకం…మజిలీ డే 7 కలెక్షన్స్

915
0

     అక్కినేని నాగ చైతన్య సమంత ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 1.66 కోట్ల షేర్ ని వసూల్ చేసింది, ఇక వరల్డ్ వైడ్ గా 6 వ రోజు 1.83 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించగా మొత్తం మీద 6 రోజుల్లో 20.11 కోట్ల షేర్ ని అందుకోగా..

వరల్డ్ వైడ్ గా సినిమా 25.41 కోట్ల షేర్ ని వసూల్ చేసింది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 6 వ రోజు లెవల్ లో ఓపెన్ అవ్వగా నైజాం మరియు వైజాగ్ ఏరియాల్లో 6 వ రోజు కన్నా బెటర్ ఓపెనింగ్స్…

తో రన్ అవుతుంది, దాంతో 6వ రోజు కన్నా 7 వ రోజు సినిమా కలెక్షన్స్ ఈ ఏరియాల్లో సాలిడ్ గా ఉండే అవకాశం ఉంది, మొత్తం మీద సినిమా 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రలల్లో ఎలేక్షన్స్ పోలింగ్ ఉన్నా కానీ ఓటు వేసిన వారు తిరిగి థియేటర్స్ వైపు భారీ గా ఎగబడుతున్నారు.

దాంతో ఓపెనింగ్స్ అండ్ ఆక్యుపెన్సీ భారీ గా పెరిగింది, ప్రస్తుతం సినిమా 7 వ రోజు ఆక్యుపెన్సీ ని బట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క పెరగడమో తగ్గడమో జరగోచ్చు.

ఇక సినిమా వరల్డ్ వైడ్ షేర్ అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా 1.85 కోట్ల మార్క్ ని దాటే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద 7 వ రోజు కూడా అదిరి పోయే రేంజ్ లో హోల్డ్ చేసి మజిలీ బాక్స్ అఫీస్ ను ఓ రేంజ్ లో ఏలుతుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here