మజిలీ ఫస్ట్ డే కలెక్షన్స్…సెన్సేషనల్!

0
686

     2019 టాలీవుడ్ మొదటి 3 నెలలు కష్టంగా గడిచినా 4 వ నెల సమ్మర్ లో మొదటి సెన్సేషనల్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆన్ లైన్ బుకింగ్స్ పరంగా నాగ చైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకునే దిశగా దూసుకు పోతుండటం విశేషం అనే చెప్పాలి. సినిమా మొదటి రోజు కి ముందు…

కేవలం 30% అడ్వాన్స్ బుకింగ్స్ తో మొదలు అయినా మొదటి షో సమయానికి 45% వరకు టచ్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి అనుకున్నట్లే 55% ని క్రాస్ చేసి దుమ్ము లేపింది, ఆల్ మోస్ట్ 60% బుకింగ్స్ కి క్లోజ్ అయ్యే రేంజ్ లో దుమ్ము లేపింది.

దాంతో మొత్తం మీద ఆన్ లైన్ బుకింగ్స్ ని బట్టి మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 5 కోట్ల దాకా షేర్ ని అందుకోవడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు. ఇక సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని పూర్తిగా ట్రాక్ చేయలేం కాబట్టి…

ఎలేక్షన్స్ అండ్ IPL ఎఫెక్ట్ పడకపోతే కెరీర్ బెస్ట్ రికార్డులు నమోదు అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి, ఒకవేళ ఎఫెక్ట్ పడితే 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి మొదటి రోజు కెరీర్ బెస్ట్ రికార్డులు…

నమోదు అవుతాయా లేదా అన్నది తేలనుంది, శైలజా రెడ్డి అల్లుడు 6.9 కోట్లతో నాగ చైతన్య కెరీర్ లో నంబర్ 1 గా నిలిచింది, మరి అఫీషియల్ కలెక్షన్స్ ఈ రికార్డును బ్రేక్ చేస్తాయో లేదో కొన్ని గంటల్లో తేలనుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!