ఇదే ఫైనల్….మజిలీ ఫైనల్ టాక్ ఇదే!!

0
352

     రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్య కి మధ్యలో శైలజా రెడ్డి అల్లుడు మరియు సవ్యసాచి సినిమాలు విజయాలను అందుకునేలా కనిపించినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం తో క్లీన్ హిట్ వేట కొనసాగగా ఎట్టకేలకు సమంత తో కలిసి చేసిన మజిలీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్పెషల్ షోలు, రెగ్యులర్ షోలకి మంచి టాక్ ని సొంతం చేసుకోగా…

ఈవినింగ్ అండ్ నైట్ షోల కి అసలు సిసలు కామన్ ఆడియన్స్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి భారీ గా క్యూ కట్టడం తో వీరి నుండి ఎలాంటి టాక్ వచ్చింది అన్నది ఆసక్తి గా మారింది, కాగా సినిమా ని చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా నచ్చేసింది.

ఫస్టాఫ్ లో కొన్ని ఇబ్బంది పెట్టె సన్నివేశాలు ఉన్నా తర్వాత పూర్తీ ఫ్యామిలీ కథ తో ఎమోషనల్ సీన్స్ తో భార్య భర్తల ఎమోషనల్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి అంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ ఎక్కువగా నచ్చింది అని తేల్చేశారు.

ఇక కామన్ ఆడియన్స్ అండ్ యూత్ కి కావలసిన మసాలాలు ఫస్టాఫ్ లో కొన్ని ఉండటం ప్లస్ అవ్వగా సెకెండ్ ఆఫ్ లో ఎమోషనల్ సీన్స్ కొంచం బోర్ కొట్టాయని అంటున్నారు, కానీ ఓవరాల్ గా రీసెంట్ టైం లో మంచి సినిమాలు లేవు కాబట్టి మజిలీ ఆకట్టుకుంది అంటున్నారు.

ఫైనల్ గా సినిమా కి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు మినిమమ్ 3 స్టార్ టు 3.25 స్టార్ రేటింగ్ తో అద్బుతమైన ఆరంభం లభించింది అని చెప్పాలి, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల హాలిడేస్ లో సినిమా ఎలా దుమ్ము లేపుతుందో అని అందరు వెయిటింగ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here