ఈ క్రమం లో సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్ షో కలెక్షన్స్ పరంగా నాగ చైతన్య కెరీర్ లో మొదటి రికార్డ్ ను నమోదు చేసింది, సినిమా అక్కడ ప్రీమియర్ షో కలెక్షన్స్ రూపం లో ఏకంగా 1 లక్షా 40 వేల కి పైగా డాలర్స్ ని వసూల్ చేయగా ఫైనల్ కౌంట్ అన్నీ అనుకున్నట్లు జరిగితే…
1 లక్షా 50 వేల డాలర్స్ ని క్రాస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు, దాంతో నాగ చైతన్య కెరీర్ లో ప్రీమియర్ షోలతో అత్యధిక గ్రాస్ ని అందుకున్న సవ్యసాచి రికార్డ్ బ్రేక్ అయింది, ఆ సినిమా ప్రీమియర్స్ ద్వారా 1 లక్షా 11 వేల డాలర్స్ ని అందుకోగా ఇప్పుడు రికార్డ్ బ్రేక్ అయింది.
ఇక సినిమా 2019 ఇయర్ కి గాను ఓవర్సీస్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న మూడో తెలుగు సినిమా గా నిలిచింది, అక్కడ ఎన్టీఆర్ కథానాయకుడు 4 లక్షల 82 వేల డాలర్స్ తో టాప్ లో ఉండగా రెండో ప్లేస్ లో ఎఫ్ 2 సినిమా 2 లక్షల 60 వేల డాలర్స్ తో టాప్ 2 లో ఉంది.
ఇప్పుడు మజిలీ సినిమా ఆల్ మోస్ట్ 1 లక్షా 50 వేల డాలర్స్ తో టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తి గా మారింది అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.