Home న్యూస్ మజిలీ (డే 4) కలెక్షన్స్….కొట్టాడు-నిలిచాడు!

మజిలీ (డే 4) కలెక్షన్స్….కొట్టాడు-నిలిచాడు!

879
0

     టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, తొలి వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా 19 కోట్లకు పైగా షేర్ ని 30 కోట్లకు పైగా గ్రాస్ ని వసూల్ చేసిన ఈ సెన్సేషనల్ మూవీ ఇప్పుడు 4 వ రోజు వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకున్నా కానీ స్ట్రాంగ్ గా నిలిచి సత్తా చాటుకుంది.

తొలి రెండు షోల కి 50% వరకు డ్రాప్స్ ఏర్పడగా సినిమా ఈవెనింగ్ అండ్ నైట్ షోల సమయానికి వచ్చే సరికి డ్రాప్ శాతం 5% పడిపోయి 45% వరకు చేరింది, అది ఫైనల్ గా 40% వరకు చేరడం తో వర్కింగ్ డే టెస్ట్ ను సాలిడ్ గా పాస్ అయ్యింది మజిలీ.

మొత్తం మీద ట్రేడ్ లెక్కల్లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటె సినిమా నాలుగో రోజు రెండు రాష్ట్రాలలో 1.8 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడం పక్కా అని చెప్పుకోవాలి, అది 2 కోట్ల మార్క్ ని అందుకుంటే గనుక లాంగ్ రన్ మరింత జోరుగా ఉంటుంది అని చెప్పొచ్చు.

మొత్తం మీద వీకెండ్ సాలిడ్ బ్యాటింగ్ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా పాజిటివ్ టాక్ పవర్ చూపుతూ మజిలీ సినిమా జోరు ని కొనసాగిస్తుంది, వారం వారం కొత్త సినిమాలు భారీ గానే ఉండటం తో సినిమా లాంగ్ రన్ లో మరీ అద్బుతాలు కాకున్నా…

నాగ చైతన్య కెరీర్ లో సరికొత్త బెంచ్ మార్క్ లను నమోదు చేసే అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పొచ్చు, ఇక మొత్తం మీద 4 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో కొద్ది గంటల్లో తేలనుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here