నైజాంలో యువసామ్రాట్ రికార్డ్…అక్కినేని హీరోల్లో నంబర్(1)

0
992

  యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా మజిలీ, బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాస్ సినిమా గానే రిలీజ్ అయ్యి మాస్ సెంటర్స్ లో కూడా అద్బుతమైన వసూళ్ళ ని సాధించిన ఈ సినిమా ఇప్పటికే 37 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని సత్తా చాటగా నైజాం ఏరియాలో సినిమా ఒక మైలురాయి ని దాటింది.

అక్కినేని హీరోలలో ఎవ్వరూ సాధించని విధంగా 13 కోట్ల షేర్ మార్క్ ని 18 వ రోజు వసూళ్ళ తో అందుకున్న మజిలీ సినిమా నాగచైతన్య కెరీర్ బెస్ట్ తో పాటు అక్కినేని హీరోలలో నంబర్ 1 మూవీ గా నిలిచింది, ఇది వరకు నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన 12.5 కోట్లకు పైగా షేర్ తో…

ఉండగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన మజిలీ ఇప్పుడు కొత్త రికార్డ్ నమోదు చేసింది, లాంగ్ రన్ లో మరిన్ని కలెక్షన్స్ ఇక్కడ యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద రెండేళ్ళ నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్య కి అద్బుతమైన టర్నింగ్ పాయింట్ గా మారింది మజిలీ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here