Home న్యూస్ బ్రేకింగ్ న్యూస్: దుమ్ము లేపుతున్న మజిలీ బుకింగ్స్!

బ్రేకింగ్ న్యూస్: దుమ్ము లేపుతున్న మజిలీ బుకింగ్స్!

266
0

     అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో అద్బుతమైన పాజిటివ్ బజ్ నడుమ రిలీజ్ అవుతున్న అప్ కమింగ్ మూవీ మజిలీ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది, కాగా సినిమా పై మంచి బజ్ నెలకొనడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని సినిమా సొంతం చేసుకోవడం ఖాయమని అంతా భావిస్తున్నారు, కాగా ఇప్పటి వరకు సినిమా కి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఒకసారి గమనిస్తే…

రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 750 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న మజిలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా మొదలు అవ్వగా సినిమా బుకింగ్స్ నైజాం మరియు కొన్ని చోట్లా సాలిడ్ గా సాగుతున్నాయి, హైదరాబాదు లో మొదటి రోజు మొత్తం మీద…

220 షోలు ప్రదర్శిస్తుండగా అందులో 120 థియేటర్స్ లో బుకింగ్స్ 70% ని క్రాస్ చేశాయి, ఇక వైజాగ్ లో కూడా బుకింగ్స్ సాలిడ్ గా ఉండగా ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ని చూస్తె 30% గా ఓవరాల్ ఉందని అంటున్నారు. ఇక ఎలేక్షన్స్ అలాగే I P L పెద్దగా ఎఫెక్ట్ చూపక పొతే…

మార్నింగ్ మొదటి షో పడే సమయానికి సినిమా 40 టు 45% వరకు ఆన్ లైన్ బుకింగ్స్ ని సాధించే అవకాశం ఉంది, ఇక ఆఫ్ లైన్ బుకింగ్స్ అండ్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే నాగ చైతన్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా…

సొంతం చేసుకునే అన్ని అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి, ఇక టాక్ ని బట్టి లాంగ్ రన్ లో సినిమా జోరు ఎలా ఉంటుంది అన్నది చెప్పగలం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here