మజిలీ ప్రీమియర్ షో రివ్యూ – టాక్ ఏంటి??

0
612

         అక్కినేని నాగ చైతన్య మరియు సమంత ల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ మజిలీ, రిలీజ్ కి ముందు నుండే మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నేడు ఏకంగా 1050 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా అందులో ఓవర్సీస్ లోనే 165 లోకేషన్స్ లో రిలీజ్ కానుంది, కాగా సినిమా ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షోల ను పూర్తీ చేసుకోగా..

అక్కడ నుండి సినిమా కి ఎలాంటి టాక్ లభించిందో తెలుసుకుందాం పదండీ. ముందుగా కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా కానీ యంగ్ ఏజ్ లోనే ప్రేమ లో పడి ప్రేమ విఫలం అయ్యాక లైఫ్ లో అనుకున్నది సాధించలేకపోయిన హీరో..

పెళ్లి అయ్యాక అయినా మారతాడు అనుకుంటే భార్య కి భారంగా మారతాడు, అలాంటి వ్యక్తి ఎలా మారి తన భార్య ప్రేమ ని అర్ధం చేసుకుని సంతోషంగా తన లైఫ్ ని కొనసాగించాడు అన్న పాయింట్ తో సినిమా తెరకెక్కిందని చెబుతున్నారు, స్టొరీ లో మరికొన్ని కథ లు కూడా ఉంటాయని అంటున్నారు.

సినిమా లో నాగ చైతన్య మరియు సమంత లు పోటి పడీ మరీ నటించి మెప్పించారని, ముఖ్యంగా నాగ చైతన్య తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో సినిమా లో ఆకట్టుకున్నాడు, కోపం, ప్రేమ, ద్వేషం ఇలా అన్ని రకాల హావభావాల తో ఆకట్టుకున్నాడని అంటున్నారు.

సినిమా ఫస్టాఫ్ పాత్రలో ఇంట్రో డాక్షన్ అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో ఉంటుందని, అవి ఆకట్టుకున్నా అక్కడక్కడా స్లో అయిన ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు, మంచి పాయింట్ తో ఇంటర్వెల్ పడగా సెకెండ్ ఆఫ్ ఎమోషనల్ టచ్ తో మెప్పిస్తుందని, క్లైమాక్స్ ఎపిసోడ్..

చాలా బాగా ఆకట్టుకుందని అంటున్నారు, మొత్తం మీద నాగ చైతన్య, సమంత మిగిలిన పాత్రలు అన్నీ ఆకట్టుకోగా సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ సినిమా కి మరింత ప్లస్ అయ్యాయని, డైరెక్షన్ కూడా అదుర్స్ అనిపించే విధంగా ఉందని వారు చెబుతున్నారు.

మొత్తం మీద అక్కడ నుండి సినిమా కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పొచ్చు, ఓవర్సీస్ ఆడియన్స్ కి ఎక్కువగా క్లాస్  మూవీస్ ఎక్కువగా నచ్చుతాయి కాబట్టి సినిమా కి అక్కడ పాజిటివ్ టాక్ రావడం సహజమే అని చెప్పాలి. సినిమా..

అసలు సిసలు టాక్ మాత్రం రెగ్యులర్ ఆడియన్స్ ఎంతవరకు సినిమా ను ఓన్ చేసుకుంటారు అన్న దాని పై ఆధారపడి ఉంటుంది అని చెప్పాలి. ఫైనల్ గా సినిమా ఇప్పుడు ఓవర్సీస్ లో కుమ్మడం ఖాయం, రెగ్యులర్ షోల టాక్ కూడా ఇలానే ఉంటె ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here