Home న్యూస్ మజిలీ రివ్యూ-రేటింగ్…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

మజిలీ రివ్యూ-రేటింగ్…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

701
0

     

అక్కినేని నాగ చైతన్య కి రీసెంట్ టైం లో సరైన విజయం లేదు, రారండోయ్ వేడుక చూద్దాం తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన తర్వాత వరుస పరాజయాలను ఎదురుకున్న నాగ చైతన్య ఇప్పుడు ఆశలన్నీ సమంత తో జోడి కట్టి చేసిన మజిలీ పైనే పెట్టుకున్నాడు, నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షోల ను పూర్తీ చేసుకోగా అక్కడ నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక అసలు టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ..

కథ: యంగ్ ఏజ్ లో ఒక అమ్మాయి ని ప్రేమించే హీరో, పెద్దలు ఆ ప్రేమ ని ఒప్పుకోకపోవడం తో విడిపోతారు, అప్పటి నుండి డిప్రెషన్ కి గురి అయిన హీరో ని పెళ్లి చేస్తే మారతాడు అని సమంత కి ఇచ్చి పెళ్లి చేస్తారు, పెళ్లి చేశాక హీరో మారాడా లేదా, ఇద్దరు కలిసారా లేదా అన్నది అసలు కథ.

పెర్ఫార్మెన్స్: నాగచైతన్య మరియు సమంత లు పోటి పడీ మరీ నటించారు, సెకెండ్ ఆఫ్ లో వీరి కలయికలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి, సెకెండ్ హీరోయిన్ కూడా బాగానే నటించింది, కానీ ఎక్కువ మార్కులు మాత్రం సమంత కొట్టేయగా, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో నాగ చైతన్య ఆకట్టుకుంటాడు.

విశ్లేషణ: సంగీతం బాగుంది, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఆకట్టుకుంది, మిగిలిన నటీనటులు ఉన్నంతలో మెప్పించగా దర్శకుడు శివ కథ పాయింట్ సింపుల్ దే ఎంచుకున్నా లీడ్ పెయిర్ నుండి అద్బుత నటన ని రాబట్టి సినిమా ని ఫీల్ గుడ్ మూవీ గా తీర్చిదిద్దాడు.

ప్లస్ పాయింట్స్:
* నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్
* సమంత అద్బుతమైన నటన
* సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్
*ఎమోషనల్ సీన్స్
* ఇంటర్వెల్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్
ఇవీ మొత్తం మీద మజిలీ సినిమా లో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్లస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్:
*చిన్న స్టొరీ లైన్ ని 2 గంటల 33 నిమిషాల లెంత్ పెట్టడం
*సెకెండ్ ఆఫ్ స్లో గా సాగడం, ట్రాక్ అక్కడక్కడా తప్పడం
* కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేక పోవడం
ఇవీ మొత్తం మీద మజిలీ సినిమా లో మేజర్ మైనస్  పాయింట్స్

ఓవరాల్ గా చూసుకుంటే మజిలీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే ఎమోషనల్ లవ్ స్టొరీ. యూత్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి నచ్చే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి, కానీ అక్కడక్కడా కొద్దిగా స్లో అవ్వడం, ట్రాక్ కొంచం తప్పినట్లు అనిపించడం మేజర్ కంప్లైంట్స్.

అవి భరించితే మజిలీ నాగ చైతన్య కెరీర్ లో రీసెంట్ టైం లోనే కాదు కెరీర్ లో కూడా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా, కొత్త తనం తో పాటు మంచి ఫ్యామిలీ మూవీ చూడాలి అనుకునే వాళ్ళని మజిలీ బెస్ట్ ఆప్షన్.. రొటీన్ మూవీస్ చూసేవారు సినిమా ని ఒకసారి చూడొచ్చు.

సినిమాకి ఫైనల్ గా మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్…. సమ్మర్ లో మజిలీ కచ్చితంగా తమ మజిలీ కి చేరవేసే సినిమా… మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Majili Total Pre Release Business - Box Office Target

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here