పాజిటివ్ టాక్ వస్తే చాలు ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయ మని ఫిక్స్ అయ్యే రోజు లివి, కానీ అప్పు డప్పుడు కొన్ని పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక చతికిల బడతాయి. కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మల్లేశం సినిమా కూడా ఈ కోవ లోకే వస్తుంది అని చెప్పొచ్చు.
రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కి అందరు రివ్యూవర్లు మినిమమ్ 3 స్టార్ టు 3.25 స్టార్ రేటింగ్ ఇచ్చారు, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మరీ దుమ్ము లేపక పోయినా మంచి వసూళ్ళ తో బిజినెస్ ని రికవరీ చేస్తుంది అని అంతా అనుకున్నా క్లాస్ మూవీస్ ని ఆదరించే వారు తక్కువే అవ్వడం వలన ఈ సినిమా పరుగును త్వరగానే ముగించింది.
సినిమా ను మొత్తం మీద 1.6 కోట్ల రేంజ్ లో అమ్మగా 2.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫైనల్ రన్ లో 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి బిజినెస్ 40 లక్షల దూరంలో ఆగిపోయి ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. దాంతో మంచి రేటింగ్ తెచ్చుకున్నా సక్సెస్ కానీ క్లాస్ సినిమాల జాబితాలో ఒకటిగా చేరింది ఈ సినిమా. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.