Home న్యూస్ చిన్న సినిమా….సాలిడ్ బిజినెస్ చేస్తుంది….మాస్ ఇది!!

చిన్న సినిమా….సాలిడ్ బిజినెస్ చేస్తుంది….మాస్ ఇది!!

1241
1

కెరీర్ మొదలు పెట్టడం కొంచం అడల్ట్ కామెడీ టైప్ సినిమాలతో మొదలు పెట్టినా తర్వాత ఫ్యామిలీ మూవీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు మారుతి…. ప్రేమ కథా చిత్రం, భలే భలే మోగాడివోయ్, మహానుభావుడు, ప్రతీ రోజూ పండగే అంటూ ఫ్యామిలీ హిట్స్ ని సొంతం చేసుకున్న మారుతి ఇప్పుడు గోపీచంద్ తో పక్కా కమర్షియల్ మూవీ చేస్తుండగా సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వడంతో…

గ్యాప్ దొరకగా ఆ గ్యాప్ లో కేవలం 30 రోజుల వర్కింగ్ డేస్ లో చిన్న హీరో సంతోష్ శోభన్ మరియు మెహ్రీన్ ల కాంబోలో మంచి రోజులొచ్చాయి అంటూ మరో కామెడీ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించారు, ఈ సినిమా డైరక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి ఆఫర్స్ సాలిడ్ గా….

వచ్చినా కానీ నో చెప్పి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా నవంబర్ 4 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ 2 రిలీజ్ అయ్యి రెండింటికీ కూడా మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా ఇప్పుడు సినిమా కి…

తెలుగు రాష్ట్రాలలో హీరో రేంజ్ దృశ్యా చూసుకుంటే ఎక్స్ లెంట్ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. ఒక్క కోస్టల్ ఆంద్ర ఏరియాలోనే సినిమా 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా సీడెడ్ ఏరియాలో 2.5 కోట్ల రేంజ్ బిజినెస్ అండ్ నైజాంలో 3.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ ఈ సినిమా కి సొంతం అవుతున్నట్లు తెలుస్తుంది… కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే…

సినిమా కి 11 కోట్ల రేంజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు, అఫీషియల్ ఏరియాల వారి బిజినెస్ రిలీజ్ కి ముందు కన్ఫాం కాబోతుంది. మారుతి బ్రాండ్ ఇమేజ్ వలన ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుందని చెప్పొచ్చు. చిన్న సినిమానే అయినా ఈ రేంజ్ బిజినెస్ అసలు ఎవ్వరూ ఊహించి ఉండరు, కానీ మేకర్స్ కొన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. సో ఫైనల్ లెక్కలు రిలీజ్ కి ముందు కన్ఫాం అవుతాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here