Home న్యూస్ మంచి రోజులు వచ్చాయి రివ్యూ….హిట్టా-ఫట్టా!!

మంచి రోజులు వచ్చాయి రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

చిన్న సినిమాల నుండి ఎదిగి ఇప్పుడు తన సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ అన్న ఫీలింగ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ లో కలిగేలా చేసిన డైరెక్టర్ మారుతి… తక్కువ టైం లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసిన లేటెస్ట్ మూవీ మంచి రోజులు వచ్చాయి… తన సినిమాల్లో హీరోకి ఎదో ఒక సమస్య పెట్టి ఆ సమస్య చుట్టూ కథని అల్లుకుని ఆడియన్స్ ను అలరించే మారుతి ఈ సారి అలా కాకుండా….

ఒక సైడ్ క్యారెక్టర్ కి ఒక ప్రాబ్లమ్ పెట్టి అతని చుట్టూ కథని అల్లుకున్నాడు, మరి ఈ కథ అనుకున్న రేంజ్ లో పండిందా లేదా అనేది తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే… అజయ్ ఘోష్ కి భయాలు ఎక్కువ…. ఇంటి పక్కన వాళ్ళు తన కూతురు గురించి ఏది చెబితే అది నమ్మి…

తన కూతురు ఎక్కడ ప్రేమలో పడుతుందో అని తనకి సంభందాలు చూస్తూ ఉంటాడు, కానీ ఆల్ రెడీ హీరోతో ప్రేమలో పడిన హీరోయిన్ ఫాథర్ సమస్య అయిన భయాన్ని పోగొట్టి తన కూతురికి తానె కరెక్ట్ అని ఎలా హీరో ప్రూవ్ చేసుకున్నాడు అన్నది సినిమా కథ…

మారుతి ఇతర సినిమాల్లో కథ ఏమి బలంగా ఉండదు కానీ కథనం ఫాస్ట్ గా సాగడం, స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా ఉంటూ కామెడీ వర్కౌట్ అవ్వడం తన సినిమాల్లో స్పెషల్స్…. కానీ మంచి రోజులు వచ్చాయి సినిమాలో కథ ఈ సారి హీరో చుట్టూ తిరగకపోవడం ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కథనం స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా ఉండటం తో బోర్ సీన్స్ ఎక్కువ అయ్యాయి.

ఫస్టాఫ్ వరకు పాత్రల పరిచయం లైట్ కామెడీ సీన్స్ తో పర్వాలేదు అనిపించగా సెకెండ్ ఆఫ్ లో కామెడీ తగ్గి మెలో డ్రామా ఎక్కువ అయింది, క్లైమాక్స్ అయినా కామెడీతో ముగుస్తుంది అనుకుంటే సెంటి మెంట్ సీన్స్ తో నింపేశారు… మరి సినిమాలో కామెడీ ఏమి లేదా అంటే కొన్ని మంచి సీన్స్ పడ్డాయి అని చెప్పాలి…

అప్ప‌డాల విజ‌య‌ల‌క్ష్మి ఎపిసోడ్ హిలేరియస్ గా వర్కౌట్ అయింది, సుదర్శన్ ప్రవీణ్ లు బాగా వచ్చించారు, అలాగే కొన్ని సెంటిమెంట్ సీన్స్ లో కూడా మారుతి తన మార్క్ చూపెట్టాడు… సంతోష్ శోభన్ పేరుకు హీరో కానీ తన కన్నా సినిమాలో సైడ్ రోల్స్ బాగా హైలెట్ అయ్యారు, హీరో కూడా పర్వాలేదు అనిపించగా హీరోయిన్ మెహ్రీన్ గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇద్దరి పెయిర్ బాగుంది…

అజయ్ ఘోష్ సినిమా కి మెయిన్ హైలెట్ అయ్యాడు, వెన్నెల కిషోర్ ఒకటి రెండు సీన్స్ నవ్వించగా, సప్తగిరి, హర్షలకు అనుకున్న రేంజ్ సీన్స్ పడలేదు… పాటలు బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది, ఎడిటింగ్ ఓకే అనిపించగా డైలాగ్స్ కొన్ని మరీ లెంత్ ఎక్కువ అయ్యాయి, ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా డైరెక్షన్ విషయంలో మారుతి మరీ ఇది వరకు చేసిన…

సినిమాల రేంజ్ లో మెప్పించలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించాడు, సినిమా హైలెట్స్ విషయానికి వస్తే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, అప్ప‌డాల విజ‌య‌ల‌క్ష్మి కామెడీ సీన్, అలాగే ఇతర కామెడీ సీన్స్ లాంటివి హైలెట్ అవ్వగా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే… సీన్స్ ని మరీ సాగదీయడం, కథలో ఏమాత్రం బలం లేక పోవడం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్…

అసలు లాజిక్స్ లాంటివి ఏమి వెతకకుండా కేవలం కామెడీ కోసం సినిమాకి వెళితే కొద్ది వరకు నవ్వించి మెప్పిస్తుంది సినిమా, కానీ మారుతి ఇది వరకు తీసిన సినిమాలతో పోల్చితే చాలా దూరంలోనే ఆగిపోయింది ఈ సినిమా… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్…. ఫ్యామిలీస్ కి కామెడీ ఎంటర్ టైనర్స్ ని ఇష్టపడే వాళ్ళు కొంచం బోర్ ఫీల్ అయినా ఒకసారి చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here